Webdunia - Bharat's app for daily news and videos

Install App

డారెన్‌ సామికి పాకిస్థాన్ పౌరసత్వం.. ఎలా లభించిందంటే?

Webdunia
ఆదివారం, 23 ఫిబ్రవరి 2020 (17:29 IST)
వెస్టిండీస్‌‌ మాజీ కెప్టెన్‌ డారెన్‌ సామికి పాకిస్థాన్ పౌరసత్వం లభించనుంది. 2017లో ఇతర దేశాల క్రికెటర్లు పాక్‌ వచ్చేందుకు నిరాకరిస్తున్న సమయంలో డారెన్‌ పీఎస్‌‌ఎల్‌‌లో ఆడాడు. ఆ తర్వాత పాక్‌‌కు వచ్చే విదేశీ క్రికెటర్ల సంఖ్య పెరిగింది. 
 
ఈ క్రమంలో పాకిస్థాన్‌ గడ్డపై మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ జరగడం వెనుక సామి చేసిన కృషికి గుర్తింపుగా ఆ దేశపు పౌరసత్వం ఇవ్వనుంది. వచ్చేనెల 23న జరిగే కార్యక్రమంలో తమ ప్రెసిడెంట్‌ ఆరిఫ్‌ అల్వీ  గౌరవ పౌరసత్వంతో పాటు పాక్‌ అత్యున్నత పురస్కారం ‘నిషాన్‌ ఈహైదర్‌ ’తో సామిని సత్కరిస్తారని పీసీబీ ప్రకటించింది. 
 
దాంతో వేరే దేశం నుంచి గౌరవ పౌరసత్వం తీసుకుంటున్న మూడో ఇంటర్నేషనల్‌ క్రికెటర్‌‌గా సామి నిలువనున్నాడు. గతంలో సెయింట్‌ కిట్స్‌ ప్రభుత్వం మాథ్యూ హేడెన్‌ (ఆస్ట్రేలియా), హెర్షల్‌ గిబ్స్‌ (దక్షిణాఫ్రికా)కు పౌరసత్వం ఇచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

తర్వాతి కథనం
Show comments