Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎస్కేకు చుక్కలు చూపిన కేకేఆర్... ధోనీ సేన ఘోర పరాజయం!!

ఠాగూర్
శుక్రవారం, 11 ఏప్రియల్ 2025 (23:16 IST)
ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో అలవోకగా విజయం సాధించింది. 104 పరుగులతో లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా జట్టు 10.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కేకేఆర్ బ్యాటర్లు సునీల్ నరైన్ (44), డికాక్ (23) రాణించారు. చెన్నై బౌలర్లలో అన్షుల్, నూర్ చెరో వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంతో ఈ సీజన్‌లో చెన్నై జట్టుకు ఇది వరుసగా ఐదో ఓటమి కావడం గమనార్హం. 
 
టాస్ ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. సీఎస్కే బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 103 పరుగులు మాత్రమే చేశారు. ఈ సీజన్‌లో చెన్నై జట్టుకు తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరించిన ధోనీ (1) నిరాశపర్చాడు. శివమ్ (31), విజయ్ శంకర్ (26) జట్టును ఆదుకున్నారు. మిగతా బ్యాటర్లలో రచిన్ 4, కాన్వే 12, రాహుల్ త్రిపాఠి 16, అశ్విన్ 1, జడేజా 0, దీపక్ హుడా 0, నూర్ అహ్మద్ 1, అన్షుల్ 3 పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్ 3, వరుణ్ 2, హర్షిత్ రాణా 2, అలీ 1, వైభవ్ 1 చొప్పున వికెట్లు పడగొట్టారు. 
 
ఐపీఎల్ తాజా సీజన్‌లో చెన్నై జట్టుకు ఇది ఐదో ఓటమి కావడం గమనార్హం. కెప్టెన్ మారినా ఆ జట్టు తలరాత మారలేదు. రుతురాజ్ గాయంతో జట్టుకు దూరంగా కాగా, కెప్టెన్‌గా ధోనీ పగ్గాలు చేపట్టినప్పటికీ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు సరికదా, మరింత దిగజారిందని, తాజా ఓటమి చెబుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments