Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోమర్‌సెట్ క్రికెట్ లీగ్‌.. నో బాల్ వేసిన బౌలర్‌పై విమర్శలే విమర్శలు

సోమర్‌సెట్ క్రికెట్ లీగ్‌లో బ్యాట్స్‌మన్ సెంచరీ చేయకుండా నో బాల్ వేసిన బౌలర్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తద్వారా క్రీడాస్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించాడు. వివరాల్లోకి వెళితే.. మైన్‌

Webdunia
మంగళవారం, 7 ఆగస్టు 2018 (16:09 IST)
సోమర్‌సెట్ క్రికెట్ లీగ్‌లో బ్యాట్స్‌మన్ సెంచరీ చేయకుండా నో బాల్ వేసిన బౌలర్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తద్వారా క్రీడాస్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించాడు. వివరాల్లోకి వెళితే.. మైన్‌హెడ్ క్లబ్ క్రికెటర్ జే డారెల్ 98 పరుగులతో క్రీజులో ఉండగా.. పర్నెల్ క్రికెట్ క్లబ్‌తో మ్యాచ్‌లో తన జట్టు విజయానికి కూడా కేవలం రెండు పరుగులు చేయాల్సి ఉంది. 
 
తన జట్టు గెలిచినప్పటికీ డారెల్ మాత్రం సెంచరీ పూర్తి చేసుకోలేకపోయాడు. ఎలాగంటే.. పర్నెల్ క్లబ్ బౌలర్ బంతిని నేరుగా బ్యాట్స్‌మన్‌కు వేయకుండా బంతి బౌండరీ వెళ్లేలా నో బాల్ వేశాడు. ఎక్స్‌ట్రా రన్స్ కింద బౌండ‌రీకి నాలుగు ప‌రుగులు, నో బాల్‌కు ఒక్క ప‌రుగు రావ‌డంతో మైన్‌హెడ్ క్లబ్ లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో డారెల్ కెరీర్‌లో తొలి సెంచరీ చేసే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. 
 
అయితే ఉద్దేశపూర్వకంగానే అతడు శతకం చేయకుండా నో బాల్ వేసిన బౌలర్‌పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దీనిపై డారెల్ ట్విటర్‌లో స్పందించాడు. ఈ రోజు మ్యాచ్ ముగిసిన తీరు క్రికెట్‌కు తలవంపు అన్నాడు. అయితే దీనిపై పర్నెల్ టీమ్ కెప్టెన్ క్షమాపణలు చెప్పాడు. తమ బౌలర్ వ్యవహరించిన తీరు సరిగాలేదన్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments