వాళ్లు అరిచి గీపెట్టినా మేము చేయాల్సింది చేస్తాం...
పార్లమెంట్ వేదికగా టీడీపీ, వైకాపా ఎంపీలు అరిచి గీపెట్టినా తాము చేయాల్సింది చేసి తీరుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఆయన ఈ మాటలను తనను కలిసిన వైకాపాకు చెందిన అరకు ఎంపీ కొత్తపల్లి గీతతో
పార్లమెంట్ వేదికగా టీడీపీ, వైకాపా ఎంపీలు అరిచి గీపెట్టినా తాము చేయాల్సింది చేసి తీరుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఆయన ఈ మాటలను తనను కలిసిన వైకాపాకు చెందిన అరకు ఎంపీ కొత్తపల్లి గీతతో అన్నారు. అంతేకాకుండా, టీడీపీ, వైకాపాలు కేవలం రాజకీయ లబ్ధికోసమే ఇదంతా చేస్తున్నాయంటూ ఆయన మండిపడ్డారట.
పార్లమెంట్ భవనంలో ప్రధాని మోడీతో కొత్తపల్లి గీత కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 'ఆంధ్రప్రదేశ్‌కు మేం మేలు చేయాలనే ఉన్నాం. కానీ... టీడీపీ, వైసీపీ రాజకీయ లబ్ధి కోసం ఇదంతా చేస్తున్నాయి. చేసుకోనివ్వండి. ఎవరు ఎలా వ్యవహరించినా మేము మాత్రం ఏపీకి న్యాయం చేస్తాం. రైల్వే జోన్ ఏర్పాటు కూడా పరిశీలిస్తున్నాం' అని వ్యాఖ్యానించారని గీత చెప్పుకొచ్చారు.
తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పూర్తిగా న్యాయం చేస్తానని, ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఈ విషయంలో వెనుకడుగువేసేది లేదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారని ఆమె వెల్లడించారు.