Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమ్ముడూ.. ఇది టెస్టు మ్యాచ్ కాదు... యువీని ఏకేసిన క్రిస్ గేల్

Webdunia
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (19:25 IST)
ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితుల కోసం నిధులను సమకూర్చేందుకు జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో సావకాశంగా ఆడిన భారత క్రికెటర్ యువరాజ్ సింగ్‌ను విండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ ఏకిపారేశాడు. ఈ మేరకు యువీపై సెటైర్లు వేస్తూ క్రిస్ గేల్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. బుష్ ఫైర్ కోసం నిర్వహించిన ఈ మ్యాచ్‌లో రికీ, గిల్ క్రిస్ట్ నేతృత్వంలోని గోల్డ్ అండ్ గ్రీన్ జట్లు పాల్గొన్నాయి. 
 
పాంటింగ్ జట్టుకు భారతీయ క్రికెట్ జాంబవంతుడు సచిన్ కోచ్‌గా వ్యవహరించాడు. అలాగే ఈ మ్యాచ్‌లో టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా పాల్గొన్నాడు. ఈ మ్యాచ్‌లో యువీ బ్యాటింగ్‌పై క్రిస్ గేల్ సోషల్ మీడియాలో సెటైర్లు విసురుతూ.. కామెంట్స్ చేశాడు. మెల్ బోర్న్, ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో యువీ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు. 
 
పది ఓవర్లు మాత్రమే కలిగివున్న ఈ మ్యాచ్‌లో యువీ నిదానంగా ఆడాడు. బ్రెట్ లీ విసిరిన ఓవర్లో రెండు పరుగులు మాత్రమే సాధించాడు. ఆపై క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీన్ని చూసిన క్రిస్ గేల్.. తమ్ముడూ ఇది టెస్టు మ్యాచ్ కాదంటూ వ్యంగ్యంగా పోస్టు చేశాడు. ఇంకా యువీ బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఇకపోతే.. భారత్‌లో జరిగే ఐపీఎల్‌లో క్రిస్ గేల్, యువరాజ్ సింగ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోసం ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

తర్వాతి కథనం
Show comments