Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు టాటా చెప్పిన బంగ్లా మాజీ కెప్టన్ రహీం

Webdunia
సోమవారం, 5 సెప్టెంబరు 2022 (11:52 IST)
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ముష్పికర్ రహీం అంతర్జాతీయ టీ20 క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెప్పాడు. ప్రస్తుతం దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ టోర్నీలో బంగ్లాదేశ్ జట్టు తరపున రెండు మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ రెండు మ్యాచ్‌లలో జట్టు ఓడిపోయింది. ఆ తర్వాత తన రిటైర్మెంట్ అంశాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 
 
కేవలం వన్డేలు, టెస్టులపై దృష్టిసారించేందుకు మాత్రమే టీ20 కెరీర్‌కు స్వస్తి చెబుతున్నట్టు ప్రకటించారు. అయతే, ఏదేని అవకాశం వస్తే మాత్రం ఫ్రాంచైజీ క్రికెట్‌లో మాత్రం ఆడతానని పేర్కొన్నాడు. వన్డేలు, టెస్టుల్లో తమ దేశానికి ప్రాతినిథ్యం వహించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. 
 
కాగా, ఈ యేడాది జూలై నెలలో ఆ దేశ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ కూడా టీ20 కెరీర్‌కు స్వస్తి చెప్పాడు. ఇపుడు ముష్పీకర్ రహీం కూడా అదే నిర్ణయం తీసుకున్నాడు. కాగా, ఆసియా కప్‌లో రహీం ఆడిన రెండు మ్యాచ్‌లలో 1, 4 చొప్పున పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ జట్టు తరపున 102 టీ20లు ఆడిన రహీం మొత్తం 1500 పరుగులు చేశాడు. ఈ ఫార్మెట్‌లో ఆయన వ్యక్తిగత అత్యధిక స్కోరు 72 (నాటౌట్)గా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

తర్వాతి కథనం
Show comments