Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై వేధింపుల కేసులో బంగ్లా క్రికెటర్ నిర్దోషి : కోర్టు తీర్పు

బాలికపై వేధింపుల కేసులో బంగ్లాదేశ్ క్రికెటర్ షాదాత్ హుస్సేన్‌, ఆయన భార్య నృతో షాదాత్‌‌లకు ఊరట లభించింది. కేసును విచారించిన న్యాయస్థానం వారిని నిర్దోషులుగా ప్రకటించింది. గతేడాది హుస్సేన్ ఇంట్లో పనిచేసే

Webdunia
సోమవారం, 7 నవంబరు 2016 (09:28 IST)
బాలికపై వేధింపుల కేసులో బంగ్లాదేశ్ క్రికెటర్ షాదాత్ హుస్సేన్‌, ఆయన భార్య నృతో షాదాత్‌‌లకు ఊరట లభించింది. కేసును విచారించిన న్యాయస్థానం వారిని నిర్దోషులుగా ప్రకటించింది. గతేడాది హుస్సేన్ ఇంట్లో పనిచేసే బాలిక కంటికి గాయమైంది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఏడుస్తూ రోడ్డు పక్కన కూర్చున్న బాలికను స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు.
 
బాలికను తీవ్రంగా హింసించిన నేరంపై హుస్సేన్, అతడి భార్యపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో వారిద్దరూ రెండు నెలల తర్వాత వారు బెయిలుపై విడుదలయ్యారు. ఈ కేసులో నేరం రుజువు చేయడంలో పోలీసులు విఫలం కావడంతో నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 
 
కేసు విచారణ కొనసాగుతుండడంతో హుస్సేన్ దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. ఇప్పటివరకు 38 టెస్టులు ఆడిన హుస్సేన్ 72 వికెట్లు తీశాడు. 51 వన్డేల్లో 47 వికెట్లు పడగొట్టాడు. కోర్టు తీర్పుతో హుస్సేన్ ఆనందం వ్యక్తం చేశాడు. చివరికి సత్యమే గెలిచిందని పేర్కొన్న ఆయన, దేశానికి తిరిగి సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మేల్లుడుతో సంబంధం పెట్టుకుంది... అడ్డొస్తున్నాడని భర్తను చంపేసింది..

Cab Driver: కారులోనే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. సాయం చేసిన క్యాబ్ డ్రైవర్

నిశ్చితార్థంలో చెంపదెబ్బ.. అయినా రూ.12లక్షలతో పెళ్లి ఏర్పాటు.. ఎన్నారై వరుడి మాయం!

కొట్టుకుందాం రా: జుట్టుజుట్టూ పట్టుకుని కోర్టు ముందు పిచ్చకొట్టుడు కొట్టుకున్న అత్తాకోడళ్లు (video)

55మంది వైద్యులను తొలగించిన ఏపీ సర్కారు.. కారణం అదే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏప్రిల్ లో ఎర్రచీర - ది బిగినింగ్ డేట్ ఫిక్స్

తల్లి అంజనా దేవి ఆరోగ్యం పై మెగా స్టార్ చిరంజీవి వివరణ

లెవెన్ నుంచి ఆండ్రియా జర్మియా పాడిన ఇక్కడ రా సాంగ్ రిలీజ్

మజాకా నుంచి సొమ్మసిల్లి పోతున్నావే జానపద సాంగ్ రిలీజ్

కృష్ణ గారు రియల్ సూపర్ స్టార్. విజయ నిర్మల ఆడపులి : అనిల్ రావిపూడి

తర్వాతి కథనం
Show comments