Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదరగొట్టిన అక్షర్ పటేల్ - ఉత్కంఠ పోరులో భారత్‌దే విజయం

Webdunia
సోమవారం, 25 జులై 2022 (07:30 IST)
కరేబియన్ దీవుల్లో పర్యటిస్తున్న భారత క్రికెట్ జట్టు ఆదివారం రాత్రి రెండో వన్డే మ్యాచ్‌ జరిగింది. ఇది ఉత్కంఠ ఫోరు సాగింది. ఇందులో భారత క్రికెటర్ అక్షర్ పటేల్ వీరోచిత పోరాటం చేశారు. ఫలితంగా ఈ పోరులో భారత్‌ గెలుపొందింది. 
 
పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్‌పార్క్ ఓవల్ మైదానంలో ఈ పోటీ జరిగింది. శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్‌లు అర్థ సెంచారీలతో రాణించారు. చివర్లో అక్షర్ పటేల్ అద్భుత ఇన్నింగ్స్‌తో  మరో రెండు బంతులు మిగిలివుండగానే విజయాన్ని అందుకుంది. ఫలితంగా భారత్ వరుసగా రెండో వన్డే మ్యాచ్‌లో గెలుపొందడంతో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 311 పరుగుల భారీ స్కోరు చేసింది. విండీస్ ఆటగాడు షాయ్ హోప్ 115 పరుగులు చేశాడు. 
 
ఆ తర్వాత 312 పరుగులు భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. తొలుత బ్యాటింగ్‌లో తడబడింది. 48 పరుగుల వద్ద కెప్టెన్ శిఖర్ ధావన్ (13) ఔట్ అయ్యాడు.  ఆతర్వాత స్వల్ప వ్యవధిలోనే గిల్ (43), సూర్యకుమార్ యాదవ్ (9)లు పెవిలియన్‌కు చేరారు 
 
ఈ దశలో శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్‌లు క్రీజ్‌లో కుదురుకోవడంతో జట్టు నిలదొక్కుకుంది. ఒక దశలో 205 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుని ఇక ఓటమి తప్పదన్న తరుణంలో క్రీజ్‌లో పాతుకుపోయిన అక్షర పటేల్ వీరోచిత ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరానికి చేర్చాడు. 
 
చివరి ఓవర్‌లో టీమిండియా గెలుపునకు 8 పరుగులు కావాల్సిరాగా, తొలి బంతికి పరుగు రాలేదు. రెండో బంతికి అక్షర్ ఒక్క పరుగు తీశాడు. మూడో బంతికి సిరాజ్ మరో పరుగు తీసి అక్షర్ పటేల్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. ఇపుడు 3 బంతుల్లో 6 పరుగులు కావాల్సిన తరుణంలో మేయర్స్ వేసిన నాలుగో బంతిని అక్షర్ బలంగా బాదడంతో అది వెళ్లి స్టాండ్స్‌లో పడింది. 
 
అంతే మరో రెండు బంతులు మిగిలివుండగానే విజయ తీరాలకు చేరింది. మొత్తం 8 వికెట్లు కోల్పోయిన భారత్ రెండో మ్యాచ్‌లో గెలుపొంది, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. అక్షర్ పటేల్‌ వన్డేల్లో తొలి అర్థ సెంచరీ నమోదు చేశాడు. మొత్తం 35 బంతుల్లో ఐదు సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 64 పరుగులు చేసిన అక్షర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు.. రేవంత్ రెడ్డి

అసెంబ్లీకి హాజరయ్యే ధైర్యం లేకుంటే జగన్ రాజీనామా చేయాలి: షర్మిల

పిజ్జా ఆర్డర్ చేస్తే.. అందులో పురుగులు కనిపించాయ్.. వీడియో

బాలినేనికి కేబినెట్‌లో స్థానం.. చంద్రబాబుకు తలనొప్పి.. పవన్ పట్టుబడితే?

సోషల్ మీడియాను దుర్వినియోగపరిచే వారికి ఎలాంటి శిక్షలు వున్నాయో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ ధూమ్ ధామ్ ఎలా వుందంటే.. రివ్యూ

నారా లోకేష్ గారూ, పవన్ గారూ, అనిత గారూ నన్ను క్షమించండి: దణ్ణం పెట్టి అభ్యర్థిస్తున్న శ్రీ రెడ్డి

గేమ్ ఛేంజర్ టీజర్ ముందుగా కియారా అద్వానీ లుక్ విడుదల

అరకులో ప్రారంభమైన సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్ షెడ్యూల్

ఉద్యోగం కోసం ప‌డే పాట్ల నేప‌థ్యంలో ఈసారైనా? మూవీ

తర్వాతి కథనం
Show comments