సిడ్నీ టెస్ట్ : ఆస్ట్రేలియాను కట్టడి చేసిన భారత్.. స్మిత్ సెంచరీ

Webdunia
శుక్రవారం, 8 జనవరి 2021 (10:32 IST)
సిడ్నీ వేదికగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో భారత్ టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్‌లో మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెంచరీ కొట్టాడు. అయినప్పటికీ.. భారత బౌలర్లు ఆసీస్‌ను కట్టడి చేశారు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 338 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. 
 
తొలిరోజు ఓవ‌ర్ నైట్ స్కోరు 166/2 తో ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా రెండో రోజైన శుక్రవారం అంత‌గా రాణించ‌లేక‌పోయింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లో స్టీవ్ స్మిత్ 131, ల‌బుషేన్ 91, ప‌కోష్కీ 62 ప‌రుగులు చేశారు.
 
డేవిడ్ వార్న‌ర్ 6, మాథ్యూ 13, కామెరాన్ గ్రీన్ 0, టిమ్ 1, క‌మ్మిన్స్ 0, స్టార్క్ 24, లైయ‌న్ 0, జొష్ 1 (నాటౌట్) ప‌రుగులు చేశారు. ఎక్స్‌ట్రాల రూపంలో ఆసీస్‌కు 10 ప‌రుగులు వ‌చ్చాయి. 
 
భారత బౌలర్లలో బౌల‌ర్ల‌లో జ‌డేజాకు 4, బుమ్రా, అశ్విన్‌ల‌కు రెండేసి వికెట్లు, సిరాజ్‌కు ఒక వికెట్ ద‌క్కింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెన‌ర్లుగా రోహిత్ శ‌ర్మ, శుభ్ మ‌న్ గిల్ క్రీజులోకి వ‌చ్చారు.
 
అంతకుముందు మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (131; 16 ఫోర్స్‌) అజేయ శ‌త‌కం చేశాడు. అలాగే, ఇక  అరంగేట్ర ఓపెనర్‌ విల్‌ పకోవ్‌స్కీ (62; 4 ఫోర్లు) ఈ మ్యాచ్‌లో అర్థ సెంచ‌రీతో రాణించిన సంగ‌తి తెలిసిందే

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అలాంటి గర్ల్ కావాలంటే గంటకు రూ. 7500, సెక్స్ రాకెట్ పైన పోలీసుల దాడి

సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదంలో మృతులంతా హైదరాబాదీయులే : హజ్ కమిటీ వెల్లడి

నేను బతికే ఉన్నాను.. ఉంటాను... షేక్ హసీనా

రాజకీయాల్లోకి వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్, ఏ పార్టీలో చేరుతారు?

అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌కు కాదు.. నవీన్ యాదవ్‌కే మద్దతు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

హైదరాబాద్ సీపీ సజ్జనార్‌పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments