Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగి తప్పుచేశా.. స్టీవ్ ఓకీఫ్ పశ్చాత్తాపం.. అయినా రూ.20వేల డాలర్ల జరిమానా

సిడ్నీలో జరిగిన ఓ క్రికెట్ కార్యక్రమంలో ఆస్ట్రేలియా టెస్టు క్రికెటర్ స్టీవ్ ఓకీఫ్‌ మద్యం మత్తులో నానా హంగామా సృష్టించాడు. 2014లో టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఓకీఫ్ 8 టెస్టుల్లో 33 వికెట్లు తీశాడ

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (16:48 IST)
సిడ్నీలో జరిగిన ఓ క్రికెట్ కార్యక్రమంలో ఆస్ట్రేలియా టెస్టు క్రికెటర్ స్టీవ్ ఓకీఫ్‌ మద్యం మత్తులో నానా హంగామా సృష్టించాడు. 2014లో టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఓకీఫ్ 8 టెస్టుల్లో 33 వికెట్లు తీశాడు. ఇతడు ఓ క్రికెట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వస్తూ వస్తూ ఫూటుగా తాగాడు. ఆపై ఓవరాక్షన్ చేశాడు. అతడి విచక్షణా రహిత ప్రవర్తనకు గాను పోలీసులు 20వేల ఆస్ట్రేలియా డాలర్లను జరిమానాగా విధించారు. అంతేగాకుండా కౌన్సిలింగ్‌కు కూడా వెళ్ళాల్సిందిగా  సూచించారు. 
 
ఇదేవిధంగా గత ఏడాది కూడా ఓకీఫ్ సిడ్నిలోని ఓ హోటల్‌లో మద్యం సేవించి రచ్చ చేశాడని.. ఇలాంటి చర్యలను క్రికెట్‌ ఆస్ట్రేలియా ఉపేక్షించబోదని జనరల్‌ మేనేజర్‌ పాట్ హోవర్డ్ తెలిపారు. కాగా భారత్‌తో ముగిసిన నాలుగు టెస్టుల సిరీస్‌లో అద్భుతంగా ఆడిన ఓకీఫ్.. మద్యం మత్తులో తప్పు చేశానని ఒప్పుకున్నాడు. తాగిన మైకంలో తాను అలా వ్యవహరించినందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తనకు విధించిన జరిమానా చెల్లించడంతో పాటు కౌన్సిలింగ్‌కు వెళ్లేందుకు అంగీకరించాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏఐ ఫర్ ఆంధ్రా పోలీస్ హ్యాకథాన్-2025లో రెండో స్థానంలో నిల్చిన క్వాడ్రిక్ ఐటీ

దేవుడు అన్నీ చూస్తున్నాడు... దేవుడు శిక్షిస్తాడు : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments