Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ హౌస్‌లో సచిన్‌ గురించి శ్రీశాంత్ ఏం చెప్పాడో తెలుసా?

బాలీవుడ్ నటుడు సల్మాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ సీజన్-12లో మాజీ క్రికెటర్ శ్రీశాంత్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సచిన్ గురించి శ్రీశాంత్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని సహచరులతో పంచుకున్

Webdunia
మంగళవారం, 16 అక్టోబరు 2018 (14:18 IST)
బాలీవుడ్ నటుడు సల్మాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ సీజన్-12లో మాజీ క్రికెటర్ శ్రీశాంత్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సచిన్ గురించి శ్రీశాంత్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని సహచరులతో పంచుకున్నారు. 2011 టీమిండియా ప్రపంచ కప్ గెలుచుకున్న సందర్భాన్ని శ్రీశాంత్ గుర్తు చేసుకున్నాడు.
  
 
ప్రపంచ కప్ తర్వాత ఆటగాళ్లంతా కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నామని.. ఆ సమయంలో ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి టీమిండియా కప్పు గెలుపుకు కారణమైన ఆటగాళ్లను ప్రశంసించారు. ఈ సందర్భంగా క్రికెటర్ల పేర్లను చెప్పాడు. కానీ తన పేరును మాత్రం చెప్పలేదు. తాను కూడా ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఇంటర్వ్యూ ముగిసేంతవరకు మౌనంగానే వుండిపోయా. చివరి నిమిషం వరకూ ఆ విలేకరి తన పేరును ప్రస్తావించలేదు. 
 
ఆ సందర్భంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కలుగజేసుకున్నారు. 2011 వరల్డ్‌ కప్‌ సమయంలో శ్రీశాంత్‌ కీలక పాత్ర పోషించారని చెప్పారు. ఆయన మాటలు విని తాను చాలాసేపటి వరకు ఏడుపు ఆపలేదని శ్రీశాంత్ గుర్తు చేసుకున్నాడు. 
 
2013లో ఐపీఎల్‌ సమయంలో శ్రీశాంత్ స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడటంతో బీసీసీఐ అతనిపై నిషేధం విధించింది. దాదాపు ఐదేళ్ల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న శ్రీశాంత్‌ ప్రస్తుతం సినిమాలు, రియాల్టీ షోలు చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments