Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే ఒక్కడు : బ్రియాన్ లారా రికార్డు ఇప్పటికీ పదిలమే

Webdunia
ఆదివారం, 12 ఏప్రియల్ 2020 (13:10 IST)
ఏప్రిల్ 12, 2004కి ఓ ప్రత్యేక ఉంది. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అపూర్వమైన రికార్డు నమోదైన రోజు. ఆ రికార్డును నెలకొల్పింది ఎవరో కాదు.. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లార్. సరిగ్గా 16 యేళ్ల క్రితం ఇదే రోజున బ్రియాన్ లారా సంప్రదాయ ఫార్మాట్​లో  400 పరుగులు మైలురాయిని చేరిన తొలి బ్యాట్స్​మన్​గా చరిత్ర సృష్టించాడు. దీంతో అప్పటివరకు గ్యారీ సోబెర్స్​ (365 నాటౌట్​) పేరిట ఉన్న రికార్డు మాయమైపోయింది. పైగా, లారా రికార్డును ఈ 4 యేళ్ళ కాలంలో ఒక్కరంటే ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా కనీసం దరిదాపులకు కూడా రాలేకపోయారు. 
 
2004, ఏప్రిల్ 12వ తేదీన సెయింట్ జాన్స్ వేదికగా ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వెస్టిండీస్ జట్టు దిగింది. ఈ ఇన్నింగ్స్‌లో లారా ఏకంగా 582 బంతులు ఎదుర్కొని 43 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 400 పరుగులు చేశాడు. 
 
ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి 751పరుగుల వద్ద ఇన్నింగ్స్​ను డిక్లేర్ చేసింది. ఆ తర్వాత ఇంగ్లండ్ ఫాలోఆన్ ఆడినా రెండో ఇన్నింగ్స్​లో నిలదొక్కుకోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. 
 
అయితే వ్యక్తిగత రికార్డు కోసం తొలి ఇన్నింగ్స్​ను మూడు రోజుల పాటు కొనసాగించడంపై లారాపై కొందరు విమర్శలు చేశారు. ఏదేమైనా లారా నమోదు చేసిన రికార్డు మాత్రం అద్వితీయమే. పైగా, ఈ రికార్డును బద్ధలు కొట్టే క్రికెటర్ ఇపుడు కనుచూపు మేరలో కనిపించడం లేదని చెప్పొచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

తర్వాతి కథనం
Show comments