Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్డే ప్రపంచ కప్ : ప్రమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేసిన ఐసీసీ

ఇంగ్లండ్, వేల్స్‌లో వచ్చే యేడాది మే 30వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచ కప్ పోటీలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఓ ప్రమోషనల్ సాంగ్‌ను విడుదల చేసి

Webdunia
గురువారం, 9 ఆగస్టు 2018 (15:47 IST)
ఇంగ్లండ్, వేల్స్‌లో వచ్చే యేడాది మే 30వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచ కప్ పోటీలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఓ ప్రమోషనల్ సాంగ్‌ను విడుదల చేసింది. ఇందులో ఇంగ్లండ్ మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ లీడ్ రోల్‌లో కనిపిస్తున్నాడు. ఈ పాట క్రికెట్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. ఈ పాటకు సంబంధించిన వీడియోను ఐసీసీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
 
ఈ వీడియోలో ముందుగా ప్రపంచ కప్ మెగా ఈవెంట్ వచ్చేస్తోందంటూ ఫ్లింటాఫ్ వ్యాఖ్యానిస్తాడు. ఆపై విజిల్ వేస్తూ ఆన్ టాప్ ఆఫ్ ది వరల్డ్ పాటను అందుకుంటాడు. దీంతో ఫ్లింటాప్ వద్దకు శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర, మహిళా క్రికెటర్ చార్లొటె ఎడ్వర్డ్స్ చేరుకుని సందడి చేస్తారు. 
 
ఈ సందర్భంగా వేర్వేరు దేశాలకు చెందిన జెండాలతో అభిమానులు డ్యాన్స్ చేస్తూ వీధుల్లో తీసుకెళ్తుంటే.. వీరిని చాలామంది ఫాలో అవుతారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా వచ్చే ఏడాది మే నుంచి ప్రారంభమయ్యే వన్డే ప్రపంచ కప్‌లో భారత్‌తో పాటు 14 దేశాలు పోటీపడనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

ఫ్యాంటు జేబులో పేలిన మొబైల్... తొడకు గాయాలు...

ఫ్లయింగ్ ట్యాంక్‌లు.. జూలైలో భారత్‌కు 3 అపాచీ హెలికాఫ్టర్లు

మద్యం సేవించి మొబైల్‍‌లో పాటలు పెట్టి బాలికలతో హెడ్మాస్టర్ అసభ్య నృత్యం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

గొడ్డలి, జూట్ రోప్ పట్టుకుని హైదరాబాద్‌లో యాక్షన్ సీన్స్ లో నాగచైతన్య షూటింగ్

Court: కోర్ట్ సినిమా నటి శ్రీదేవి కారు కొనేసిందోచ్!

తర్వాతి కథనం
Show comments