Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన.. సూపర్ హీరో.. అలిస్టర్ కుక్.. గుడ్ బై చెప్పేశాడు..

ఇంగ్లండ్ క్రికెటర్ అలిస్టర్ కుక్ అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి చెప్పాడు. ఈ నెల 7వ తేదీన భారత్‌తో జరగనున్న ఐదో టెస్ట్ మ్యాచ్ తన క్రికెట్ జీవితంలో చివరి మ్యాచ్‌గా కుక్ అధికారికంగా ప్రకటించాడు. ఇంగ్లాండ

Webdunia
సోమవారం, 3 సెప్టెంబరు 2018 (18:04 IST)
ఇంగ్లండ్ క్రికెటర్ అలిస్టర్ కుక్ అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి చెప్పాడు. ఈ నెల 7వ తేదీన భారత్‌తో జరగనున్న ఐదో టెస్ట్ మ్యాచ్ తన క్రికెట్ జీవితంలో చివరి మ్యాచ్‌గా కుక్ అధికారికంగా ప్రకటించాడు. ఇంగ్లాండ్‌ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో కుక్ ఒకరిగా రికార్డు సృష్టించాడు. రెండు దశాబ్ధాలుగా క్రికెట్ ఆడిన కుక్ అద్భుతమైన రికార్డులను సాధించాడు. 
 
అత్యంత పిన్న వయస్సులో టెస్టుల్లో పదివేల పరుగుల మైలురాయిని దాటిన ఆటగాడిగా కుక్ సచిన్ పేరిట ఉన్న రికార్డును బద్ధలు కొట్టాడు. సచిన్ 31 ఏళ్ల 326 రోజుల వద్ద ఈ మైలురాయిని బద్ధలు కొడితే.. కుక్ 31 సంవత్సరాల 157 రోజుల్లోనే ఈ ఘనతను సాధించాడు. అంతేకాదు ఇంగ్లాండ్ తరపున పదివేల పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగానూ నిలిచాడు. అలాగే 160 టెస్టుల్లో 12,254 పరుగులు చేశాడు. ఇందులో 32 శతకాలు, 56 అర్థసెంచరీలు వున్నాయి. 
 
ఇక 92 వన్డేల్లో 3204 పరుగులు చేశాడు.. ఇందులో 5 సెంచరీలు, 19 అర్థసెంచరీలు ఉన్నాయి. అత్యథిక వ్యక్తిగత స్కోరు 137. ఇక పొట్టి క్రికెట్‌లో 4 మ్యాచ్‌లు ఆడి.. 61 పరుగులు చేశాడు. మార్చి 1, 2006లో టెస్ట్ క్రికెట్‌లోకి కుక్ అడుగుపెట్టాడు. 2012లో ఆండ్రూ స్టాస్ నుంచి సారథ్య బాధ్యతలు స్వీకరించిన కుక్.. 24 టెస్టుల్లో జట్టుకు కెప్టెన్ వ్యవహరించి 24 ఏళ్ల తర్వాత యాషెస్ సిరీస్‌లో ఆసీస్‌ను ఓడించి సిరీస్‌ అందించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments