Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్‌పై సిరీస్ గెలిచిన ఖుషీ.. థాలీ ఏర్పాటు.. కోహ్లీ ఖమన్, ధోనీ కిచిడీ..!

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (17:40 IST)
Motera Thali
టీమిండియా ఇంగ్లండ్‌పై సిరీస్ గెలిచిన ఆనందంలో ఏర్పాటు చేసిన క్రికెట్ రాస్ ఫెస్టివల్‌లో భాగంగా థాలీని ఏర్పాటు చేశారు. టెస్ట్ సిరీస్ విజయం సాధించిన భారత్ శుక్రవారం నుంచి 18 వరకూ ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ లో పాల్గొననుంది. ఆ తర్వాత వన్టే సిరీస్ కూడా ఉంటుంది. ఇటీవలే ఢిల్లీలోని 18 కిలోల థాలీ, దుబాయ్ లోని గోల్డెన్ థాలీ ఇలా పాపులర్ అయిన సంగతి తెలిసిందే.
 
ప్రస్తుతం అహ్మదాబాద్ లోని కోర్ట్ యార్డ్ బై మారియట్ హోటల్ కూడా ఇలాంటి ఓ సరికొత్త ప్రయోగంతో ముందుకొచ్చింది. భారతీయులకు ఎంతో ఇష్టమైన క్రికెట్ ని వారికి ప్రీతిపాత్రమైన భోజనంతో కలిపి ఐదు అడుగుల థాలీని సిద్ధం చేసింది. ఈ అతి పెద్ద థాలీకి ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా పిలిచే మొతేరా స్టేడియం పేరు పెట్టడం కూడా విశేషం. 
 
క్రికెట్ రాస్ లో భాగంగా ఈ థాలీ మెనూ కూడా క్రికెట్ థీమ్ తోనే ఏర్పాటు చేయడం విశేషం. వంటకాలకు కూడా ఆటగాళ్ల పేర్లను పెట్టారు. కొహ్లీ ఖమన్, పాండ్యా పాత్రా, ధోనీ కిచిడీ, భువనేశ్వర్ భర్తా, రోహిత్ ఆలూ రసీలా, శార్దూల్ శ్రీఖండ్, బుమ్రా భిండీ శిమ్లా మిర్చ్, హర్బజన్ హాండ్వీ లతో పాటు బౌన్సర్ బాసుందీ, హాట్రిక్ గుజరాతీ దాల్ లాంటి మరెన్నో క్రికెట్ థీమ్ వంటకాలను ఈ థాలీలో చేర్చారు. 
 
ఒక్కో థాలీలో నాలుగైదు బౌల్స్ లో ఒక్కో వంటకాన్ని సర్వ్ చేయడం విశేషం. వీటితో పాటు స్నాక్స్, రకరకాల రోటీలు, స్టార్టర్స్, డ్రింక్స్, డెజర్ట్స్ ఈ థాలీలో ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

తర్వాతి కథనం
Show comments