Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియో ఒలింపిక్స్‌లో హృద్యమైన ప్రేమఘట్టం.. హె జీ వేలికి ప్రేమగా ఉంగరం తొడిగి..?

రియో ఒలింపిక్స్‌ వేదిక ఒక ప్రేమ జంటకు వేదికగా మారింది. అసలు విషయం ఏంటంటే... మూడు మీటర్ల స్ప్రింగ్‌బోర్డు డైవింగ్ ఈవెంట్‌లో అద్భుతమైన విన్యాసాలు కనబర్చిన చైనీస్ డైవింగ్ క్రీడాకారిణి హె జీ రజత పతకాన్ని

Webdunia
సోమవారం, 15 ఆగస్టు 2016 (17:16 IST)
రియో ఒలింపిక్స్‌ వేదిక ఒక ప్రేమ జంటకు వేదికగా మారింది. అసలు విషయం ఏంటంటే... మూడు మీటర్ల స్ప్రింగ్‌బోర్డు డైవింగ్ ఈవెంట్‌లో అద్భుతమైన విన్యాసాలు కనబర్చిన చైనీస్ డైవింగ్ క్రీడాకారిణి హె జీ రజత పతకాన్ని సొంతం చేసుకుంది. మెడల్ అందుకొని సంతోషంగా ఆమె పొడియం దిగగానే.. ఆమె ప్రియుడు, సహచర డైవింగ్ ఆటగాడు కిన్ కై (30) ఆమెను అడ్డుకున్నాడు. ఆమె దగ్గరకు వెళ్లి మోకాళ్లపై కూర్చుని లవ్ ప్రపోజల్ చేశాడు. 
 
దీంతో అమితానందానికి గురైన ఆమె, అతడి ప్రేమను అంగీకరించి చిరునవ్వు చిందించింది. అంతేకాకుండా ఆ ప్రియుడు తన ప్రియురాలికి చిన్న కానుకను అందించాడు. హె జీ వేలికి అతడు ప్రేమగా ఉంగరం తొడిగి.. తన దానిని చేసుకున్నాడు. ఈ హృద్యమైన ప్రేమఘట్టం చూస్తున్న ప్రేక్షకులను కదిలించింది. వారు ఆనందంతో హర్షధ్వానాలు చేశారు. ఈ ప్రేమజంటను నిండుమనస్సుతో ఆశీర్వదించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

Inter student : గుండెపోటుతో తెలంగాణ విద్యార్థి మృతి.. కారణం ఏంటంటే?

భార్యాభర్తల బంధం ఎంతగా బీటలు వారిందో తెలిసిపోతోంది : సుప్రీంకోర్టు

క్యాబ్‌లో వెళ్తున్న టెక్కీలకు చుక్కలు చూపించిన మందు బాబులు.. ఏం చేశారంటే? (video)

నేను కన్నెర్ర చేస్తే చస్తారు: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి హెచ్చరికలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

తర్వాతి కథనం
Show comments