Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిట్ మ్యాన్‌‌ అరుదైన రికార్డు.. @ 14 ఇయర్స్

Webdunia
బుధవారం, 23 జూన్ 2021 (13:28 IST)
టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్, హిట్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన రోహిత్ శర్మ అరుదైన రికార్డు నమోదు చేశాడు. 2007లో ఐసీసీ ప్రవేశపెట్టిన మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో భారత జట్టు తరుపున ఆడిన రోహిత్ శర్మ, 14 ఏళ్ల తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కూడా ఆడుతున్నాడు. 2007 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్, 2021 వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో పాల్గొన్న ఏకైక ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసిన రోహిత్ శర్మకు, ఇది ఐదో ఐసీసీ ఫైనల్ మ్యాచ్.
 
ఇంతకుముందు 2007 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో 16 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 30 పరుగులు చేసిన రోహిత్ శర్మ, ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి అదరగొట్టాడు. అయితే 2011 వన్డే వరల్డ్‌కప్‌లో మాత్రం రోహిత్ బరిలో దిగలేదు. 
 
2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2014 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌తో పాటు 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో ఓపెనర్‌గా వచ్చిన రోహిత్ శర్మ, 2021 ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోనూ ఓపెనింగ్ చేశాడు. నాలుగు ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌లో ఓపెనర్‌గా బరిలో దిగిన భారత ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ.
 
రోహిత్ శర్మ టెస్టుల్లో సెంచరీ చేసిన ఏ మ్యాచుల్లోనూ భారత జట్టు ఓడిపోలేదు. రోహిత్ సెంచరీ చేసిన ఏడు టెస్టుల్లోనూ భారత జట్టు భారీ విజయాలు అందుకుంది. రోహిత్ శర్మ నాటౌట్‌గా నిలిచిన 8 మ్యాచుల్లోనూ భారత జట్టుకి పరాజయం ఎదురవ్వలేదు. 
 
అలాగే రోహిత్ శర్మ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన 10 మ్యాచుల్లోనూ భారత జట్టుకి ఓటమి ఎదురుకాలేదు. అలాగే రోహిత్ శర్మ టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో 2 సిక్సర్లు బాదిన మ్యాచుల్లోనూ టీమిండియా ఓడిపోలేదు. 13 మ్యాచుల్లో రోహిత్ రెండేసి సిక్సర్లు బాదగా, వీటిల్లో భారత జట్టు విజయాలు అందుకుంది.
 
34ఏళ్ల రోహిత్ శర్మ పరిమిత ఓవర్స్ ఫార్మాట్ లో తిరుగులేని బ్యాట్స్ మెన్. రోహిత్ లెజెండ్ అని చెప్పడానికి సందేహం లేదు. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్. టీ 20ల్లో 4 సెంచరీలు బాదిన ఏకైక భారత క్రికెటర్. అంతర్జాయతీ క్రికెట్ లో తనకంటూ ఓ గుర్తింపు సాధించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయటం జాతీయ అభివృద్ధికి కీలకం

అసెంబ్లీకి రాను, మీడియా ముందు ప్రతిపక్ష నాయకుడిగా ప్రశ్నిస్తా: వైఎస్ జగన్

ఎవరైనా చెల్లి, తల్లి జోలికి వస్తే లాగి కొడ్తారు.. జగన్‌కి పౌరుషం రాలేదా? (video)

పసుపు చీరతో షర్మిల ఆకర్షించిందా.. విజయసాయికి బుద్ధుందా?: బుద్ధా వెంకన్న

ట్రోలింగ్‌తో నా కుమార్తెలు కన్నీళ్లు పెట్టుకున్నారు.. పవన్ కామెంట్స్ వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు స్ఫూర్తి సూర్య నే : ఎస్ఎస్ రాజమౌళి - అవకాశం మిస్ చేసుకున్నా: సూర్య

షూటింగులో గాయపడిన సునీల్ శెట్టి...

ధర్మం కోసం జితేందర్ రెడ్డి ఏం చేశాడు.. రివ్యూ

మట్కా లో అదే నాకు బిగ్ ఛాలెంజ్ అనిపించింది : జివి ప్రకాష్ కుమార్

ఐఫా వేడుకల్లో తేజ సజ్జా - రానా కామెంట్స్.. సారీ చెప్పాలంటూ మహేశ్ ఫ్యాన్స్ డిమాండ్...

తర్వాతి కథనం
Show comments