Webdunia - Bharat's app for daily news and videos

Install App

గబ్బిలాలు కుట్టాయి.. ఆస్పత్రిలో చేరిన సైంటిస్ట్.. కరోనా వుహాన్ ల్యాబ్‌లోనే పుట్టిందా?

Webdunia
ఆదివారం, 17 జనవరి 2021 (17:28 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ చైనాలోని వుహాన్ సిటీలో ఉన్న ఓ ల్యాబ్‌లోనే పుట్టిందని చాలా మంది ఆరోపిస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికా కూడా ఇవే వాదనలు వినిపించింది. కానీ చైనా మాత్రం అవన్నీ తప్పుడు వార్తలంటూ కొట్టిపారేస్తూ వచ్చింది. అయితే ఆ అనుమానాలు, ఆరోపణలే నిజమని తాజాగా తేలింది. ఆ వుహాన్ ల్యాబ్‌లో ఉన్న సైంటిస్టులే ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం. 
 
ఓ గుహలో పరిశోధనలు చేయడానికి వెళ్లిన సమయంలో తమను కరోనా వైరస్ సోకిన గబ్బిలాలు కుట్టాయని వాళ్లు చెప్పారు. ఈ సంచలన విషయాన్ని తైవాన్ టైమ్స్ వెల్లడించింది. 2017లో ఈ ల్యాబ్‌కు చెందిన కొందరు పరిశోధకులు ఓ గుహలోకి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు వివరించింది.
 
ఇందులో ఒక సైంటిస్ట్ మాట్లాడుతూ.. ఆ సమయంలో ఓ గబ్బిలం తాను చేతికి వేసుకున్న రబ్బర్ గ్లోవ్స్ లోపలికి వెళ్లి కుట్టినట్లు చెప్పారు. తాము ఆ గుహలో కొన్ని శాంపిల్స్ సేకరిస్తున్నట్లు తెలిపారు. గబ్బిలాలపై చేతులకు కనీసం గ్లోవ్స్ లేకుండా పరిశోధనలు నిర్వహించామని, మాస్క్‌లు లేకుండా వైరస్‌లను పరీక్షించినట్లు కూడా ఆ ల్యాబ్ సిబ్బంది వెల్లడించడం గమనార్హం. 
 
ఇవన్నీ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది. ప్రస్తుతం కరోనా మూలాల కోసం డబ్ల్యూహెచ్‌వోకు చెందిన 13 మంది సభ్యుల బృందంలో చైనాలోని వుహాన్‌లో ఉన్న విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajasaheb: ప్రభాస్ రాజాసాబ్ కీలక అప్ డేట్ - కీసరలో రీషూట్స్ !

పోస్టర్ తో ఆసక్తికలిగించిన సుధీర్ బాబు హీరోగా చిత్రం

CULT: రచయిత, హీరోగా, దర్శకుడిగా విశ్వక్సేన్ చిత్రం కల్ట్ ప్రారంభం

భైరవం నుంచి నిజమైన ఫ్రెండ్షిప్ సెలబ్రేషన్ సాంగ్ తో రాబోతున్నారు

Ram Charan: సమంత శుభం అదుర్స్.. రామ్ చరణ్ కితాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments