Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్ వ్యాధి తగ్గినా వేధించే సమస్యలు... ఏంటవి?

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (23:10 IST)
ప్రపంచవ్యాప్తంగా సంక్రమణ కేసులు పెరుగుతూనే ఉన్నందున, కోవిడ్ 19 కేవలం జలుబు లేదా ఫ్లూ లాంటి సంక్రమణ మాత్రమే కాదని ఆధారాలు స్పష్టమవుతున్నాయి. ఇది అన్ని వయసుల వారికి, వివిధ స్థాయిలలో ఉన్నవారికి ప్రమాదాన్ని కలిగిస్తుంది. కరోనావైరస్ వ్యాధి నుంచి బయటపడినప్పటికీ కొందరిలో పలు సమస్యలు వేధించే అవకాశం వుందని పలు అధ్యయనాలు చెపుతున్నాయి.
 
శరీరంలో వ్యాధి నిరోధక శక్తి కారణంగా వైరల్ లోడ్ క్షీణించి ఉండవచ్చు, కానీ దగ్గు, గొంతులో గురగుర, అలసట వంటి కొన్ని సాధారణ లక్షణాలు అనారోగ్యంతో పోరాడిన తర్వాత వారాల పాటు కొనసాగుతూనే ఉంటాయి. కోలుకున్న రోగులలో కొందరు ఆసుపత్రులకు తిరిగి వస్తున్నారు. తమకి గుండె సమస్యలు, మానసిక క్షోభ కలుగుతుందనీ, కుంగుబాటుగా వుందని ఇంకా మరెన్నో సమస్యలను ఫిర్యాదు చేస్తున్నారు.
 
కరోనావైరస్ వల్ల దీర్ఘకాలిక అలసట, బలహీనత.. అంటే ఇది కొన్ని వారాలు మరియు నెలలు కొనసాగవచ్చు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత వారిపై నిపుణులు చేసిన అధ్యయనంలో పాల్గొన్న దాదాపు 60% మంది రోగులు కోలుకున్న వారాలలో అలసట, బద్ధకం, అలసటతో బాధపడుతున్నట్లు అంగీకరించారు. వీరిలో, 1/3 వ వంతు మంది తమకు క్లిష్టమైన సమస్యలు వున్నట్లు వెల్లడించారు.
 
కరోనా నుంచి బయటపడినప్పటికీ కొందరిలో శ్వాస తీసుకోవడంలో స్వల్ప ఇబ్బంది రావడం, దడతో బాధపడటం రెండవ అత్యంత సాధారణమైనదిగా పిలువబడింది. రోగులు అనారోగ్యానికి ముందు ఈ లక్షణంతో బాధపడలేదని అంగీకరించారు. మరోవైపు లాక్డౌన్ మన జీవితాలకు అసాధారణ ఒత్తిడిని తెచ్చిపెట్టింది. కానీ వ్యాధితో పోరాడుతున్న వారికి, లేదా కోలుకున్నవారికి, ఒత్తిడి మరియు ఆందోళనతో పోరాడటం చాలా కష్టం. 
 
దీర్ఘకాలంలో మానసిక రుగ్మతలతో బాధపడే అవకాశం ఉంది. ఇటలీ ఆసుపత్రులలో ఒక ప్రత్యేక అధ్యయనం జరిగింది. చికిత్స సమయంలో రోగి యొక్క మానసిక శ్రేయస్సు బాధపడే అవకాశాలను పెంచుతుందని చెప్పారు. నిద్రలేమి, నిరాశ, ఆందోళన మరియు అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్ (OCD) సాధారణంగా కనిపించాయి. పురుషుల కంటే మహిళలు మానసిక క్షోభకు గురయ్యే అవకాశం ఉందని కూడా గమనించారు. కాబట్టి వీటి గురించి ఆందోళన చెందకుండా ధ్యానం, యోగా వంటి ప్రశాంతతను పెంపొందించేవి ఆచరించడం, మనసుకు నచ్చిన పనులు చేయడం చేస్తూ వుంటే ఈ సమస్యలను త్వరితగతిన బయటపడవచ్చు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments