Webdunia - Bharat's app for daily news and videos

Install App

థర్డ్ వేవ్ దిశగా వెళుతున్న ప్రపంచం - వీకే పాల్ హెచ్చరిక

Webdunia
శనివారం, 17 జులై 2021 (08:01 IST)
ప్రపంచం కరోనా థర్డ్ వేవ్ దిశగా పయనిస్తుందని, ఇది కాదనలేని వాస్తవం అని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ అన్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న కరోనా వాస్తవిక పరిస్థితులపై వీకే పాల్ మీడియా సమావేశం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే మూడు, నాలుగు నెలలు ఎంతో కీలకమన్నారు. ప్రపంచం కరోనా థర్డ్ వేవ్ దిశగా వెళుతోందని, ఇది కాదనలేని వాస్తవమన్నారు. 
 
ఇప్పటికే అమెరికా మినహా మిగతా దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని వీకే పాల్ వివరించారు. భారత్‌లో ఇప్పటివరకు హెర్డ్ ఇమ్యూనిటీ రాలేదని, కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉందని గుర్తుచేశారు.
 
దేశంలో కొవిడ్ థర్డ్ వేవ్ రాకుండా చూడాలన్న లక్ష్యం దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. టీకా రెండు డోసులు తీసుకున్న వారిలో 95 శాతం మరణాలు తగ్గాయని వీకే పాల్ అన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ కరోనా టీకాలను విధిగా వేయించుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments