Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ వ్యాప్తంగా 15-18 యేళ్ల లోపు యువతకు వ్యాక్సినేషన్ ప్రారంభం

Vaccination
Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (13:16 IST)
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నుంచి 15-18 యేళ్ల లోపు చిన్నారులకు కరోనా  వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందుకోసం ఆయా రాష్ట్రాలు ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. అలాగే, రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేశాయి. అయితే, ఏదేని ఒక గుర్తింపు కార్డు ఉంటేనే రిజిస్ట్రేషన్ చేసి, టికా వేస్తారు. 
 
పెద్దలకు ఇచ్చినట్టుగానే చిన్నారులకు కూడా రెండు డోసుల టీకాను ఇవ్వనున్నారు. మొదటి డోస్ వేసిన 28 రోజుల తర్వాత రెండో డోస్ టీకా వేస్తారు. టీకా వేసుకునేవారిలో 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులే అధికంగా ఉన్నారు. 
 
దీనిపై ఆరోగ్య శాఖ అధికారులు స్పందిస్తూ, చిన్నారులకు కరోనా టీకాలు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అలాగే, పిల్లల ఆధార్ కార్డు, ఐడీ కార్డులను తప్పనిసరిగా తీసుకుని రావాలని వారు కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments