Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత బయోటెక్ కోవాగ్జిన్‌కు తాత్కాలిక బ్రేక్

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (10:08 IST)
కరోనా వైరస్ సోకకుండా వివిధ కంపెనీలు పలు రకాలైన టీకాలను తయారు చేశారు. ఇలాంటి వాటిలో భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ ఒకటి. దీని అత్యవసర వినియోగపు అనుమతుల కోసం తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, ఎప్పటికప్పుడు అడ్డంకులు ఉత్పన్నమవుతూనేవున్నాయి. 
 
ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అనుతులు వస్తే ప్రపంచ వ్యాప్తంగా కోవాగ్జిన్ వాడటానికి అవకాశం వస్తుంది. ప్రస్తుతం డబ్ల్యూహెచ్‌వో అమోదించిన వ్యాక్సిన్లు తీసుకున్నవారికి మాత్రమే విదేశాలకు ప్రయాణించే అవకాశం ఉంది. దీంతో, కోవాగ్జిన్ తీసుకున్న భారతీయులు విదేశాలకు ప్రయాణించాలంటే ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. 
 
ముఖ్యంగా విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్న విద్యార్థులకు తీవ్ర అడ్డంకులు ఏర్పడుతున్నాయి. నవంబర్ 3న అత్యవసర వినియోగపు అనుమతుల గురించి డబ్ల్యూహెచ్‌వో సాంకేతిక సలహా గ్రూప్ మళ్లీ సమావేశం జరుగనుంది.
 
నిజానికి మన దేశంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలనే అధికంగా వినియోగిస్తున్నారు. ఎమర్జెన్సీ లిస్టింగ్‌‍లో చోటు దక్కించుకున్న వ్యాక్సిన్లను డబ్ల్యూహెచ్‌వో కొనుగోలు చేసి.. పేద దేశాలకు సరఫరా చేస్తుంటుంది. అయితే, ఈయూఎల్‌లో ప్రస్తుతం కోవాగ్జిన్‌కు చోటు దక్కలేదు. ఇందుకోసం భారత్ బయోటెక్ యాజమాన్యం తన వంతు ప్రయత్నాలను చేస్తోంది. 
 
ఈ ఏడాది ఏప్రిల్ 19వ తేదీన కోవాగ్జిన్‌కు సంబంధించిన పూర్తి క్లినికల్ డేటా, రీసెర్చ్ డాక్యుమెంట్లు, ట్రయల్స్‌‌కు సంబంధించిన పూర్తి వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందజేసింది. డాక్యుమెంట్లను పరిశీలించిన ప్రపంచ ఆరోగ్యం సంస్థ సమాచారం అసమగ్రంగా ఉందని పేర్కొంటూ, రిస్క్-బెనిఫిట్ అసెస్‌మెంట్‌కు సంబంధించిన సమాచారం మరింత కావాలని పేర్కొంది. దీంతో ఈ వ్యాక్సిన్ అనుమతికి తాత్కాలిక బ్రేక్ పడినట్టయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments