Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా చికిత్సలో రెమ్‌డెసివిర్ ఔషధం.. భేష్‌గా పనిచేస్తుందట!

Webdunia
శుక్రవారం, 1 మే 2020 (10:46 IST)
కరోనా చికిత్సలో రెమ్‌డెసివిర్ ఔషధం ప్రభావం అద్భుతంగా పనిచేస్తుందని తాజా పరిశోధనలో తేలింది. ప్రస్తుతం ఇండో-అమెరికన్ వైద్యుడి ఆధ్వర్యంలో మూడో దశ క్లినికల్ ట్రయల్ జరుగుతోంది. వైరస్ నివారణ సామర్థ్యం కలిగిన జౌషధాల్లో రెమ్‌డెసివిర్ ఒకటి. కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తున్న తరుణంలో ఈ ఔషధంపై పరిశోధనలు, ప్రయోగాలు జరుగుతున్నాయి. 
 
అమెరికా ఫార్మా కంపెనీ ఈ ఔషధాన్ని కరోనా రోగులపై పరీక్షించగా సత్ఫలితాలు కనిపించాయి. ఇండో-అమెరికన్ ఫిజీషియన్‌తో సహా పరిశోధకుల బృందం మూడో దశ ట్రయల్స్ నిర్వహించగా సత్ఫలితాలు వచ్చాయని ఫార్మా కంపెనీ వెల్లడించింది. 
 
కాలిఫోర్నియా కేంద్రం గల ఫార్మా కంపెనీ గిలియడ్ సైన్సెస్ ఈ ఫలితాల గురించి వివరిస్తూ కరోనా రోగుల్లో 50 శాతం మందిని రెమ్‌డెసివిర్ ఐదు రోజుల డోస్‌లతో చికిత్స చేయగా చాలా పురోగతి కనిపించిందని వారిలో సగానికి సగం మందిని ఆస్పత్రి నుంచి రెండు వారాల్లో డిశ్చార్జి చేయడమైందని వెల్లడించింది. 
 
రెమ్‌డెసివిర్ ప్రత్యేకత ఏంటంటే ఇది వైరస్‌పై నేరుగా దాడి చేస్తుంది. గతంలో ఎబోలా వైరస్ నివారణకు దీన్ని నివారించారు. వైరస్ ఆర్‌ఎన్‌ఎ, డిఎన్‌ఎలోని మూలకాలను పోలి ఉండే ఈ ఔషధం వైరస్ పునరుత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. ఇతర ఔషధాలు మనిషి లోని రోగ నిరోధక శక్తిలో మార్పులు తీసుకొచ్చి వైరన్‌ను అడ్డుకునేలా చేస్తే ఈ ఔషధం మాత్రం వైరస్‌పై నేరుగా దాడి చేస్తుంది. 
 
ఫిబ్రవరి 21న ఈ ఔషధంపై అధ్యయనం ప్రారంభమైంది. అమెరికా, ఐరోపా, ఆసియా లోని 68 ప్రాంతాల్లో వెయ్యి మందిపై ఈ ఔషధ ప్రభావాన్ని పరీక్షించారు. రెమ్‌డెసివిర్ ఔషధం వల్ల క్షేమం కలుగుతుందని, సమర్ధంగా ఇది పనిచేస్తుందని నిరూపణ అయితే అదనపు డేటా అవసరమౌతుందని పరిశోధకులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

ప్రతీ అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయీ ఉంటాడు : డియర్ ఉమ సుమయ రెడ్డి

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments