Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిల్లర్ కరోనా : అమెరికా అల్లకల్లోలం ... వణికిపోతున్న యూరప్...

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (09:23 IST)
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ముఖ్యంగా, అమెరికా, యూరప్ దేశాలు అయితే వణికిపోతున్నాయి. ఈ రెండు దేశాల్లో కరోనా మృతులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఒక్క అమెరికాలోనే గత 24 గంటల్లో ఏకంగా 884 మంది చనిపోయారు. అలాగే, యూరప్‌లో బుధవారం రాత్రికి మరణాల సంఖ్య ఏకంగా 30 వేలకు దాటింది. 
 
అలాగే, అమెరికాలో ఇప్పటివరకు ఈ వైరస్‌ బారినపడి 5,110 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 25,200 కేసులు నమోదు కాగా, మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,15,215కు చేరుకుంది. మార్చి 27న ఇటలీలో 969 మంది కరోనాతో చనిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 9,35,840 నమోదు అయ్యాయి. 47,241 మంది మృతి చెందారు. అత్యధికంగా ఇటలీలో 13,155 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
ఇదిలావుంటే, కోవిడ్ 19తో యూరప్ వణికిపోతోంది. ఇక్కడ మొత్తం 4,58,601 కేసులు నమోదయ్యాయి. ఇందులో బుధవారం రాత్రి వరకు మృతి చెందిన వారి సంఖ్య 30 వేలు దాటిపోయింది. మొత్తంగా 30,063 మంది కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 
 
కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు స్పెయిన్ తమ దేశంలోని ఆసుపత్రుల్లో బెడ్లను 20 శాతం పెంచడమే కాకుండా క్రీడా కేంద్రాలు, లైబ్రరీలు, ఎగ్జిబిషన్‌ సెంటర్లను కూడా ఆసుపత్రులుగా మార్చేందుకు సిద్ధమైంది. హోటళ్లను రికవరీ గదులుగా మార్చింది. కరోనా రోగులకు సేవలు అందించేందుకు ముందుకు రావాల్సిందిగా వైద్య విద్యార్థులు, రిటైర్డ్ వైద్యులు, విమానాల్లోని మెడికల్ సిబ్బందిని ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు పిలుపునిచ్చాయి. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments