Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా పేషెంట్ల కోసం రోజుకు రెండు సినిమాలు: ప్రభుత్వ విప్ చెవిరెడ్డి

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (21:11 IST)
ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సరికొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా నిలుస్తున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఏర్పాటు చేసిన "కోవిడ్ - 19 కేర్ సెంటర్"లో కరోనా పేషంట్ల మానసిక ఉపశమనం కోసం రోజుకు రెండు సినిమాల ప్రదర్శించేందుకు నిర్ణయించారు.

తన సొంత నిధులతో టీవీ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. కరోనా బారిన పడ్డామనే మానసిక ఆందోళన పేషంట్లలో నెలకొనకుండా ఉండేందుకు ఈ విధానం దోహదపడుతుందని చెవిరెడ్డి పేర్కొన్నారు. అలాగే మెదడుకు పదునుపెట్టి ఉత్సాహాన్ని నింపే ఇండోర్ గేమ్స్ చెస్, క్యారమ్స్ ఏర్పాటు చేశారు.

మనో వికాసానికి దోహదం చేసే పుస్తక పఠనం ఏర్పాటు చేశారు. మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం వంటివి అమలుకు చర్యలు చేపట్టారు. అంతే కాకుండా తన సొంత నిధులతో కోవిడ్ కేంద్రానికి వచ్చే పేషంట్‌కు అవసరమైన 32 వస్తువులు పేస్ట్, బ్రష్, దుప్పటి, ప్లేట్, గ్లాస్ వంటి వాటితో కూడిన కిట్‌ను అందజేస్తున్నారు. ఇలా కరోనా బాధితుల గురించి అన్ని విధాలా ఆలోచిస్తూ సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకుంటూ చెవిరెడ్డి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments