త్రివిక్రమ్ శ్రీనివాస్ - అల్లు అరవింద్‌లకు కరోనా పాజిటివ్??

Webdunia
ఆదివారం, 4 ఏప్రియల్ 2021 (09:52 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన అనేక మంది సెలెబ్రిటీలు వరుసగా కరోనా వైరస్ బారినపడుతున్నారు. ఇప్పటికే అనేకమంది సెలెబ్రిటీలు ఈ వైరస్ బారినపడి కోలుకున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో ఇద్దరు సెలెబ్రిటీలు ఈ వైరస్ బారినపడినట్టు వార్తలు వస్తున్నాయి. వారు ఎవరో కాదు.. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఉన్నారు.
 
ప్రస్తుతం వీరు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారని, తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. అయితే దీనిపై వారి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు. ఇప్పటికే ఈ నెల 9న విడుదల కావాల్సిన 'వకీల్‌సాబ్‌' చిత్రంలో కీలక పాత్రను పోషించిన హీరోయిన్‌ నివేదా థామస్‌కు కరోనా సోకిన విషయం తెల్సిందే. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ధృవీకరించింది కూడా. ఈ కారణంగా నివేదా థామస్‌ 'వకీల్‌ సాబ్‌' ప్రమోషన్స్‌లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments