Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి సాయంత్రంతో ప్రచారానికి బంద్ : 6న పోలింగ్

Webdunia
ఆదివారం, 4 ఏప్రియల్ 2021 (09:38 IST)
తమిళనాడుతో సహా పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆదివారం సాయంత్రంతో తెరపడనుంది. ఈ నెల 6వ తేదీన పోలింగ్ జరుగనుంది. ప్రచారంలో భాగంగా హోరెత్తిన మైకులు మూగబోనున్నాయి. ఈ నెల 6న పోలింగ్‌ జరగనుంది. ఒకే విడతలో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. పోలింగ్‌కు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. 
 
ఎన్నికల కోసం మొత్తం 1,55,102 ఈవీఎంలను వినియోగిస్తున్నారు. 80 ఏళ్ల పైబడిన వారికి పోస్టల్‌ ఓట్లు వేసేలా అధికారులు అవకాశం కల్పించారు. దీని కోసం 2.44 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఫలితాలు మే 2న వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. అయితే పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేందుకు ఇప్పటికే అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. 
 
తమిళనాడు రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల బరిలో ఉన్నాడీఎంకే, డీఎంకే, కమల్‌హాసన్‌, దినకరన్‌ పార్టీలతో పాటు పలు రాజకీయ పక్షాలు బరిలో ఉన్నాయి. అయితే అన్నాడీఎంకే, డీఎంకే కూటముల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. ఇరు పక్షాలకు చెందిన రాష్ట్ర జాతీయ పార్టీ అగ్రనేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌షా, రాహుల్‌ గాంధీ ఇతర కూటముల పక్షాన ప్రచారం నిర్వహించారు.
 
తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం గడువు మే 24వ తేదీతో ముగియనుంది. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ తదితర పక్షాలు ఉండగా, డీఎంకే నేతృత్వంలోని కూటమిలో కాంగ్రెస్‌, మరికొన్ని పార్టీలు ఉన్నాయి. ఇక జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు చెరో 25 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments