Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో మరో జిల్లాకు వ్యాపించిన కరోనా... 728కు పెరిగిన కేసులు

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (13:29 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తికి ఏమాత్రం అడ్డుకట్టపడటం లేదు. ఫలితంగా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. పైగా తాజాగా మరో జిల్లాకు ఈ వైరస్ వ్యాపించింది. ఫలితంగా మంచిర్యాల జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైంది. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమై హైఅలెర్ట్ ప్రకటించారు. జిల్లా ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. 
 
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ముత్తరావుపల్లికి చెందిన ఓ మహిళకు అనారోగ్యం చేయడంతో ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. ఈనెల 14వ తేదీన ఆమె హైదరాబాద్‌లోనే చనిపోయింది. అప్పటికే పంపిన శాంపిల్స్‌లో ఆమెకు పాజిటివ్‌ అని తేలడంతో ముత్తరావుపల్లిలో అధికారులు హైఅలర్ట్‌ ప్రకటించారు. చనిపోయిన మహిళతో ఊరిలో వారికి ఉన్న అనుబంధం, కలిసిన వారి వివరాలు సేకరిస్తున్నారు. 
 
ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 728 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఏకంగా 368 కేసులు ఉన్నాయి. అలాగే, ఈ వైరస్ సోకి ఇప్పటివరకు 18 మంది చనిపోయారు. దీంతో ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో జరిగిన మత సమ్మేళనానికి వెళ్లివచ్చిన వారందరూ విధిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments