Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాలో 1628 - దేశంలో 38164 పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 19 జులై 2021 (18:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 71,152 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,628 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. ఇటీవల కాలంలో రాష్ట్రంలో అదే అత్యల్పం. ఇందులో తూర్పు గోదావరి జిల్లాలో 291, చిత్తూరు జిల్లాలో 261, నెల్లూరు జిల్లాలో 241, ప్రకాశం జిల్లాలో 134 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 25 మందికి కరోనా నిర్ధారణ అయింది.
 
మరోవైపు, 2,744 మంది కరోనా నుంచి కోలుకోగా, 22 మంది మరణించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఐదుగురు మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి మొత్తం కరోనా మృతుల సంఖ్య 13,154కి పెరిగింది.
 
ఇకపోతే, రాష్ట్రంలో ఇప్పటివరకు 19,41,724 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,05,000 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 23,570 మంది చికిత్స పొందుతున్నారు.
 
మరోవైపు, గడిచిన 24 గంటల్లో 38,164 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,11,44,229కు చేరింది. అలాగే, నిన్న 38,660 మంది కోలుకున్నారు.
 
మరణాల విషయానికొస్తే... నిన్న‌ 499 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,14,108కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,03,08,456 మంది కోలుకున్నారు. 4,21,665 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

నేను మీ నాగార్జునను.. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్ బిర్యానీ... (Video)

తల్లి లేని ప్రపంచమే లేదు అందుకే కథను నమ్మి తల్లి మనసు తీశా: ముత్యాల సుబ్బయ్య

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments