దేశంలో మళ్లీ పెరిగిన కోవిడ్ పాజిటివ్ కేసులు

Webdunia
శుక్రవారం, 8 జులై 2022 (11:17 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఒక్కసారిగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో మొత్తం 3.79 లక్షల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా అందులో 18815 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. దీంతో కరోనా వైరస్ వ్యాప్తి పాజిటివిటీ రేటు ఏకంగా 4.96 శాతానికి పెరిగింది. 
 
అలాగే, కేసుల సంఖ్య కూడా పెరిగింది. ఈ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటకతో సహా పలు రాష్ట్రాల్లో వైరస్ విజృంభణ కనిపిస్తోంది. ఇప్పటివరకూ 4.35 కోట్ల మందికి కరోనా సోకిందని శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 
 
ప్రస్తుతవ్యాప్తి కారణంగా క్రియాశీల కేసులు 1,22,335కి చేరాయి. మొత్తం కేసుల్లో వాటి వాటా 0.27 శాతానికి చేరగా.. రికవరీ రేటు 98.52 శాతానికి పడిపోయింది. 24 గంటల వ్యవధిలో 15,899 మంది కోలుకోగా.. 38 మంది మరణించినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi Tour: రామ్ చరణ్ పెద్ది పవర్‌ప్లే టూర్ ప్రారంభించింది

నిర్మాత, ఎగ్జిబిటర్ల మధ్య దూషణలు, థియేటర్ ఆదాయంపై వివాదం చెలరేగింది

జగపతి బాబు, ఆకెళ్ల వి కృష్ణ కాంబినేషన్ చిత్రం వదలా టైటిల్ సాంగ్ రిలీజ్

Sanjaydath: ది డెవిల్ ఆగ‌మ‌నం - కెడి: ది డెవిల్ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా

తర్వాతి కథనం
Show comments