దేశంలో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (11:12 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగాయి. నిన్నటికి నిన్న 25 వేలుగా ఉన్న ఈ కేసుల సంఖ్య గత 24 గంటల్లో ఏకంగా 35 వేలు దాటిపోయాయి. కొత్తగా 37,593 మంది వైరస్ సోకినట్లు తేలింది. మరో 648 మంది మహమ్మారి కారణంగా మరణించారు. 
 
కొత్తగా ఒక్క రోజు వ్యవధిలో 34,169 మంది కరోనా​ను జయించారు. అయితే తాజా కేసుల్లో 64.6 శాతం కేసులు ఒక్క కేరళలోనే వెలుగుచూశాయి. సోమవారం ఆ రాష్ట్రంలో 24,296 కొత్త కేసులు నమోదయ్యాయి. మే 26 (28,798 కేసులు) తర్వాత కేరళలో 24వేల పైన కేసులు నమోదవడం మళ్లీ ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
ఇదిలావుంటే, దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,25,12,366గా ఉంటే, మొత్తం మరణాలు 4,35,758గాను, మొత్తం కోలుకున్నవారు 3,17,54,281గాను, యాక్టివ్ కేసులు 3,22,327 చొప్పున ఉన్నాయి. 
 
ఇదిలావుంటే, మంగళవారం ఒక్కరోజే 61,90,930 కరోనా వ్యాక్సిన్ డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు 59,55,04,593 టీకా డోసులను పంపిణీ చేసినట్లు తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రీసెంట్‌గా వచ్చిన చిత్రంలోలాగా మా చిత్రంలో ఏఐ ఉపయోగించలేదు : నిఖిల్

విజయ్ చిత్రం జన నాయగన్ విడుదల ఇప్పట్లో లేనట్టేనా?

హిమాన్షీ ఖురానాకు బెదిరింపులు - రూ.10 కోట్లు డిమాండ్

​అతి ప్రేమ భయానకం అంటూ వస్తోన్న 100 డేస్ లవ్ స్టోరీ

Garuda Ram: నాగబంధం నుంచి బైరాగి గా గరుడ రామ్‌ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?

Pink salt : పింక్ సాల్ట్ ఆరోగ్య ప్రయోజనాలు.. ఇందులో అయోడిన్ ఉండదు

Valentines Day: వాలెంటైన్స్ డే.. ఎర్ర గులాబీల ఔచిత్యం.. సెయింట్ వాలెంటైన్ గౌరవార్థం..

అల్లంతో కండరాల నొప్పి, బహిష్టు నొప్పి తగ్గుతుంది

తర్వాతి కథనం
Show comments