Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఏమాత్రం తగ్గని పాజిటివ్ కేసుల నమోదు

Webdunia
బుధవారం, 21 జులై 2021 (17:18 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య నమోదుతో ఏమాత్రం తగ్గుదల కనిపించడం లేదు. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 86,280 సాంపిల్స్‌ని పరీక్షించగా 2,527 మంది కోవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. 
 
అలాగే కోవిడ్ వల్ల చిత్తూరులో నలుగురు, కృష్ణలో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, తూర్పు గోదావరిలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, వైఎస్ఆర్ కడపలో ఒక్కరు, శ్రీకాకుళంలో ఒకరు, విశాఖపట్నంలో ఒక్కరు చొప్పున మరణించారు. అలాగే, గడచిన 24 గంటల్లో 2,412 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు.
 
ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం ఉన్న యాక్టీవ్ కేసుల సంఖ్య…23939 కాగా, డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య…1909613, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య… 1946749, మొత్తం మరణాల సంఖ్య…13197గా ఉంది. 
 
ఇదిలావుంటే, తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కారణంగా నలుగురు మరణించినట్లు కేంద్రం వెల్లడించింది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతీ పవార్ రాజ్యసభలో మంగళవారం బ్లాక్ ఫంగస్‌పై ఓ సభ్యుడు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ విషయం వెల్లడించారు. 
 
బ్లాక్ ఫంగస్‌తో దేశవ్యాప్తంగా 4,332 మంది మరణించారని తెలిపారు. తెలంగాణలో 2,538 మంది ఈ ఫంగస్ బారినపడగా నలుగురు మాత్రమే చనిపోయినట్టు వివరించారు.
 
ఇక కరోనాతో మరణించిన వైద్య సిబ్బందికి పీఎంజీకేపీ బీమా కింద ఒక్కొక్కరికి రూ.50 లక్షల బీమా చెల్లించినట్టు కేంద్ర సహాయమంత్రి భారతీ పవార్ తెలిపారు. ఇందుకు సంబంధించి తెలంగాణ నుంచి 64 క్లెయిమ్స్ వచ్చాయని, వాటిలో 53 పరిష్కరించామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments