మళ్లీ 40 వేల దిగువకు కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (10:09 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసులో మళ్లీ 40 వేల దిగువకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో 38,949 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. 
 
అలాగే, 24 గంట‌ల్లో  40,026  మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,10,26,829కు చేరింది. మరణాల విషయానికొస్తే... నిన్న‌ 542 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,12,531కు పెరిగింది. 
 
దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,01,83,876 మంది కోలుకున్నారు. 4,30,422 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 39,53,43,767 వ్యాక్సిన్ డోసులు వేశారు. నిన్న 38,78,078 డోసులు వేశారు.
 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 44,00,23,239 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 19,55,910 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 
 
అలాగే, తెలంగాణాలో అదే స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. గురువారం నాటి ప్రకటన మేరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 710 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. అలాగే మరోవైపు కరోనా తో 4గురు మృతిచెందారు. ఇక గడిచిన 24 గంటల్లో 808 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.
 
తాజా గణాంకాల ప్రకారం మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,34,605కు చేరుకోగా.. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 6,20,757కు పెరిగింది. అలాగే మృతిచెందినవారి సంఖ్య 3,747కు చేరుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: మార్చి నెల ఉస్తాద్ గబ్బర్ సింగ్‌కు కలిసి వచ్చేలా వుంది

Sathya: నాగ చైతన్య చిత్రం వృషకర్మ లో సత్య లుక్‌

Srinath: మెన్షన్ హౌస్ మల్లేష్ నిజాయితీగా తీసిన సినిమా: శ్రీనాథ్ మాగంటి

Anantha Sriram: యూత్ కి ఒక యాంథమ్ లాగా ఉండాలనే రై రై రారా. పాట రాశాం : అనంత శ్రీరామ్

Bandla Ganesh: ఓటీటీ వద్దని సాయి, నితిన్‌కు ఫోన్‌ చేసి థియేటర్‌లో చేయమని చెప్పా : బండ్ల గణేష్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తర్వాతి కథనం
Show comments