దేశంలో ఉగ్రరూపం దాల్చనున్న కరోనా వైరస్

Webdunia
ఆదివారం, 9 జనవరి 2022 (09:25 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పతాకస్థాయికి చేరనుంది. ముఖ్యంగా ఫిబ్రవరి 15వ తేదీ నాటికి ఉగ్రరూపం దాల్చుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి గత నెల వరకు దేశంలో పెద్దగా ప్రభావం చూపని కరోనా వైరస్.. ఇపుడు అన్ని రాష్ట్రాల్లో తీవ్రస్థాయిలో వ్యాపిస్తుంది. 
 
ఇప్పటికే దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష కేసులను దాటేసింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 15వ తేదీ నాటికి కరోనా థర్డ్ వేవ్ ఉగ్రరూపం దాల్చుతుందని ఐఐటీ మద్రాస్ గణిత విభాగం ప్రొఫెసర్ డాక్టర్ జయంత్ ఝా అభిప్రాయపడ్డారు. తాను జరిపిన కంప్యూటర్ అధ్యయనం ద్వారా ఈ విషయాన్ని గుర్తించినట్టు చెప్పారు. 
 
అయితే, కరోనా థర్డ్ వేవ్ ఉధృతికి ప్రధాన కారణం ప్రజలు నిర్లక్ష్యం, అజాగ్రత్తలే కారణని ఆయన చెప్పుకొచ్చారు. ప్రధానంగా గతంలోమాదిరిగా ప్రజలు భౌతికదూరాన్ని విస్మరించడం, కరోనా ఆంక్షలు లేకపోవడంతో థర్డ్ వేవ్ ఉధృతి ఎక్కువగా ఉంటుందని తెలిపారు. 
 
అందువల్ల రెండో వేవ్‌‌తో పోల్చితో థర్డ్‌వేవ్‌లో భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యే ఆస్కారం ఉందని ఆయన హెచ్చరించారు. అయితే, మరణాల తీవ్రత మాత్రం రెండో వేవ్‌తో పోల్చితే కాస్త తక్కువగానే ఉంటుందని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయవలస నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి: కార్తీక్ జయంతి

మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ నిర్మించిన రావు బహదూర్ చిత్రం డేట్ ప్రకటన

Kiran Abbavaram: ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్న తిమ్మరాజుపల్లి టీవీ సినిమా

Nikhil Siddhartha: నిఖిల్ స్వయంభు షూటింగ్ కష్టాలు !

Chiranjeevi: రామ్ చరణ్ హార్డ్ వర్కర్ అంటూ కితాబిచ్చిన పెద్ది టీమ్

తర్వాతి కథనం
Show comments