Webdunia - Bharat's app for daily news and videos

Install App

చచ్చిన కుక్కలను చెత్త వాహనంలో పడేసినట్లు కోవిడ్ రోగుల శవాలు చెత్త బండిలో...

Webdunia
గురువారం, 15 ఏప్రియల్ 2021 (20:15 IST)
ఎపుడైనా వీధి కుక్కలు చనిపోతే... వాటిని చెత్త వాహనాల్లో వేసుకుని వెళ్లి డంప్ యార్డులో పడేస్తుంటారు. అలాంటి ఘటన మనుషుల మృతదేహాలను తరలించే దారుణ ఘటన ఛత్తీష్ ఘడ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎంతటిదో ఈ దారుణ ఘటన చూపిస్తోంది.
 
కరోనా కారణంగా చనిపోయిన నలుగురు వ్యక్తుల మృతదేహాలను తరలించేందుకు చెత్తను తరలించే వాహనాలను ఉపయోగించి చెత్తను పారేసినట్లు మనుషుల మృతదేహారను ఆ బండిలో పడేశారు. ఆ తర్వాత ఆ నలుగురి మృతదేహాలను స్మశానానికి తరలించారు. హృదయాన్ని కలచివేసే ఈ ఘటన ఛత్తీస్ ఘడ్ లోని రాజ్‌ నందగావ్‌ జిల్లాలోని డోంగార్గావ్‌‌లో చోటుచేసుకుంది.
 
చనిపోయిన నలుగురు వ్యక్తులు ఆక్సిజన్ అందక మరణించినట్లు అనుమానాలు వ్యక్తమవుతుండగా అలాంటిదేమీ లేదని వైద్యాధికారులు కొట్టిపారేశారు. వారి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో మృతి చెందినట్లు తెలిపారు. చనిపోయిన వారి మృతదేహాలను స్మశానాలకు తరలించడం తమ బాధ్యత కాదనీ, అదంతా నగర పాలక సంస్థ చూసుకోవాల్సిందేనంటూ అధికారులు చెప్పారు. నగర పాలక సంస్థ వారు ఇలా చెత్త వాహనాల్లో మృతదేహాలను తరలించడం విమర్శలకు దారితీస్తోంది..

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

తర్వాతి కథనం
Show comments