Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కోరల్లో నుండి మెల్లగా బయటపడుతున్న దేశ రాజధాని ఢిల్లీ

Webdunia
సోమవారం, 27 జులై 2020 (17:28 IST)
రాజధానిలో కోవిడ్ 19 పరిస్థితి మెరుగు పడిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. వర్చువల్ విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ, ఢిల్లీలో కరోనా రికవరీ రేటు 88 శాతంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం 9 శాతం మంది మాత్రమే అనారోగ్యంతో ఉన్నారని, నమోదైన మొత్తం కేసులలో రెండు, మూడు శాతం మంది మాత్రమే మరణించారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. అదేవిధంగా మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్లు తెలిపారు.
 
ఢిల్లీ మోడల్ గురించి భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా చర్చ జరుగుతుందని సీఎం అన్నారు. జూన్ నెలలో కోవిడ్ మరణాలు 44 శాతం తగ్గాయని, మరణాల రేటు జీరోకు వచ్చినప్పుడే ఉపశమనం అని అన్నారు. కాగా జూలై 16న ఢిల్లీ లోని పార్లమెంటు సభ్యులందరితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మద్దతు ఉండటంతోనే కరోనా వైరస్‌తో పోరాడే ఢిల్లీ మోడల్ సాధ్యమైందని తెలిపారు.
 
ఇదిలావుంటే మార్చి 2న తొలి కేసు నమోదైన తర్వాత జూన్ 23న ఒకే రోజు అత్యధికంగా 3,947 కేసులు వచ్చాయి. అయితే అది సరిగ్గా నెలరోజులకు 1,349గా నమోదైంది. నెలరోజుల్లోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేసుల్ని నియంత్రించాము. జూన్ నెలలో 36 శాతం ఉన్న రికవరీ రేటు, జూలై 25 నాటికి అది 88 శాతానికి పెరిగిందన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments