తెలుగు రాష్ట్రాలను వణికిస్తోన్న బ్లాక్ ఫంగస్.. నిండిపోతున్న ఆస్పత్రులు

Webdunia
బుధవారం, 26 మే 2021 (12:28 IST)
Black fungus
తెలుగు రాష్ట్రాలను బ్లాక్ ఫంగస్ వణికిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. ఒక్క తెలంగాణాలోనే బ్లాక్ ఫంగస్ కేసులు 1000 నమోదయ్యాయి. ఈ ఫంగస్‌తో బాధపడే బాదితులు హైదరాబాద్‌లోని కోఠిలో ఉన్న ఈఎన్‌టీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. రోజు రోజుకు బ్లాక్ ఫంగస్ కేసులు పెగుతుండటంతో ఈ ఆసుపత్రికి వచ్చే బాధితుల సంఖ్య పోరుగుతోంది. దీంతో ఆసుపత్రిలో బెడ్స్ మొత్తం ఫుల్ అయ్యిపోయాయి.
 
రోజు రోజుకు ఈ కేసులు పెరుగుతుండటంతో మసాబ్ ట్యాంక్ ప్రాంతంలో ఉన్న సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో కూడా బ్లాక్ ఫంగస్ బాదితులకు చికిత్స అందిస్తున్నారు. సరోజిని కంటి ఆసుపత్రిలో అదనంగా 200ల బెడ్స్ ఏర్పాటు చేసి బాధితులకు చికిత్సనందిస్తున్నారు డాక్టర్లు. అలాగే గాంధీ ఆసుపత్రిలో కూడా బ్లాక్ ఫంగస్ బాదితులు రావటంతో అక్కడ 50 బెడ్స్ ఏర్పాటు చేసి చికిత్స అందిస్తుననారు.
 
ఈ క్రమంలో ఫంగస్ బాధతులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మరో 1500ల బెడ్స్ పెంపుకు రంగం సిద్ధం చేసింది. ఏడు మెడికల్ కాలేజీల్లో ట్రీట్ మెంట్ అందించే చర్యలుతీసుకుంది ప్రభుత్వం. కేవలం హైదరాబాద్ నగరంలోనే కాక నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments