Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ.. కాంగ్రెస్ నేత నరేంద్ర యాదవ్ మృతి

Webdunia
సోమవారం, 13 జులై 2020 (10:02 IST)
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 356మంది ప్రాణాలు కోల్పోయారని తెలంగాణ సర్కారు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన కాంగ్రెస్ నేత జి. నరేందర్ యాదవ్ కరోనాతో మరణించారు. ఆయన మృతితో కుటుంబీకులు, అనుచరులు, ఆప్తులు, బంధువులు, కార్యకర్తలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇటీవలే కరోనా బారిన పడ్డ రోగులకు సహాయ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
 
ఈ కార్యక్రమంలోనే ఆయన కరోనా సోకింది. దీంతో యశోద ఆస్పత్రిలో వైద్యం తీసుకుంటున్న ఆయన సోమవారం ఉదయం కన్నుమూశారు. నరేందర్ మృతితో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది.

కాగా.. ఇటీవల గాంధీభవన్‌లో జరిగిన అన్ని కార్యక్రమాల్లో నరేందర్ పాల్గొన్నారు. దీంతో ఆ కార్యక్రమాల్లో పాల్గొన్న నేతలు, కార్యకర్తల్లో టెన్షన్ మొదలైంది. కాంగ్రెస్ నేతలందరూ.. కరోనా పరీక్షలు చేయించుకునే పనిలో పడ్డారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments