Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రెండు టీకాలతో వీర్యకణాలు తగ్గవు!

Webdunia
శనివారం, 19 జూన్ 2021 (09:48 IST)
కరోనా వైరస్ బారినపడకుండా ఉండేందుకు వ్యాక్సిన్లు వేయించుకోవాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. దీంతో వివిధ ఫార్మా దిగ్గజాలు వివిధ పేర్లతో వ్యాక్సిన్లను తయారు చేసి అందుబాటులోకి తెచ్చాయి. అయితే ఈ టీకాలు వేసుకోవడం వల్ల పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుందనే ప్రచారం సాగుతోంది. 
 
అయితే, ఫైజర్‌, మోడెర్నా టీకాలు వేసుకోవడం వల్ల ఏమాత్రం హాని కలిగించవని తాజా అధ్యయనమొకటి తేల్చింది. వీర్యకణాల సంఖ్యను అవి తగ్గించవని నిర్ధారించింది. 18-50 ఏళ్ల మధ్య వయసున్న 45 మంది వాలంటీర్లపై అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మియామి పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. 
 
ఇందులోభాగంగా, తొలి డోసు వేయడానికి 2-7 రోజుల ముందు వాలంటీర్ల నుంచి వీర్యం సేకరించారు. రెండో డోసు పూర్తయ్యాక దాదాపు 70 రోజులకు మరోసారి వీర్యం తీసుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రమాణాలకు అనుగుణంగా.. వీర్యం పరిమాణం, గాఢత, వీర్యకణాల చలనశీలత వంటి అంశాలను పరిశీలించారు. 
 
టీకా వేయించుకున్నాక ఏ ఒక్కరిలోనూ సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గలేదని గుర్తించారు. వాస్తవానికి రెండు డోసులు పూర్తయ్యాక వారిలో వీర్యకణాల సంఖ్య, చలనశీలత కొంతమేరకు మెరుగైందని పేర్కొన్నారు. ఫైజర్‌, మోడెర్నాల్లో సజీవ వైరస్‌ కాకుండా ఎంఆర్‌ఎన్‌ఏ ఉంటుందని పరిశోధకులు గుర్తుచేశారు. వీర్యంపై అవి ప్రభావం చూపే అవకాశాల్లేవని తేల్చిచెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments