Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబుల్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చారు.. అంతే స్పృహతప్పి పడిపోయిన యువతి

Webdunia
శనివారం, 19 జూన్ 2021 (09:41 IST)
కంట్లూరులో కలకలం రేగింది. ఓ యువతికి వైద్య సిబ్బంది ఒకే సారి డబుల్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చింది. గుట్టుచప్పుడు కాకుండా యువతిని ఆసుపత్రిలో అబ్జర్వేషన్‌లో ఉంచారు. వ్యాక్సిన్ కోసం అబ్దుల్లాపూర్ మెట్ జెడ్పీహెచ్‌కు లక్ష్మీ ప్రసన్న (21) వెళ్లారు. ఫోన్ మాట్లాడుతూ ఆమెకు నర్సు పద్మ వెంట వెంటనే రెండు డోసుల వాక్సిన్స్ ఇచ్చారు. వాక్సిన్ అనంతరం కొద్దీ సేపటికే యువతి కళ్ళు తిరిగి పడిపోయారు.
 
వెంటనే ఆమెను వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి యువతిని తరలించారు. ప్రస్తుతం లక్ష్మీ ప్రసన్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా వున్నప్పటికి అబ్జర్వేషన్‌లో ఉంచామని వైద్యులు అంటున్నారు. లక్ష్మీ ప్రసన్నకు ఏమి జరుగుతుందోనని కటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
 
విషయం వెలుగులోకి రావడంతో నర్సు నిర్లక్యంపై స్థానికులు మండిపడుతున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నర్సు పద్మను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వ్యాక్సిన్ కోసం వెళ్లిన వారిని పట్టించుకోకుండా గంటలు గంటలు ఫోన్లు మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments