Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలులో కలకలం : 11 నెలల చిన్నారికి కరోనా పాజిటివ్

Webdunia
మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (14:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వేగం ఏమాత్రం తగ్గడం లేదు. పైగా, పలు జిల్లాలు కరోనా హాట్ స్పాట్ జిల్లుగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో 11 నెలల చిన్నారికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆ చిన్నారిని సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంచారు. కానీ, ఈ చిన్నారి కుటుంబ సభ్యులకు జరిపిన పరీక్షల్లో వారందరికీ నెగెటివ్ వచ్చింది. ఈ ఘటన కర్నూలు జిల్లా అప్సరి మండలం జోహరాపురం గ్రామంలో జరిగింది. 
 
ఈ చిన్నారి గత కొన్ని రోజలుగా కరోనా లక్షణాలతో బాధపడుతూ వచ్చింది. దీంతో సోమవారం ఆ చిన్నారితో పాటు కుటుంబ సభ్యులంతా కోవిడ్ ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో 11 నెలల చిన్నారికి మాత్రం పాజిటివ్ అని రాగా, మిగిలిన వారికి మాత్రం నెగెటివ్ అని వచ్చింది. 
 
ఏపీలో మరో 82 కొత్త కేసులు 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కరోనా పడక విసిరింది. దీంతో గత 24 గంటల్లో కొత్తగా మరో 82 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త కేసులతో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 1259కి చేరింది. 
 
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 5,783 శాంపిళ్ళను సేకరించి పరీక్షించగా 82 మందికి కోవిడ్ 19 సోకినట్టు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 1,259 పాజిటివ్ కేసులకు గాను 258 మంది డిశ్చార్జ్ కాగా, 31 మంది మరణించారని వివరించింది.
 
ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 970గా ఉందని తెలిపింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో అనంతపురంలో 1, చిత్తూరులో 1, గుంటూరులో 17, కడపలో 7, కృష్ణాలో 13, కర్నూలులో 40, నెల్లూరులో 3 కేసులు నమోదయ్యాయి. విజయనగరంలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 
 
ఇకపోతే, జిల్లాల వారీగా పాజిటివ్ కేసులను పరిశీలిస్తే, అనంతపురం 54, ఈస్ట్ గోదావరి 74, గుంటూరు 39, గుంటూరు 254, కడప 65, కృష్ణ 223, కర్నూలు 332, నెల్లూరు 82, ప్రకాశం 56, శ్రీకాకుళం 4, విశాఖపట్టణం 22, వైస్ట్ గోదావరి 54 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments