Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంగోలులో ప్రైవేటు ఆస్పత్రి నిర్లక్ష్యం, మృతదేహాలు తారుమారు

Webdunia
మంగళవారం, 18 ఆగస్టు 2020 (16:47 IST)
ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రైవేటు ఆస్పత్రి నిర్లక్ష్యం వలన ఓ కుటుంబానికి వేదన మిగిల్చింది. ఒక కుటుంబానికి అప్పగించాల్సిన మృతదేహాన్ని మరో కుటుంబానికి అప్పగించారు. ఒంగోలు శివారు ప్రాంతంలో ఉన్న రమేష్ సంఘమిత్ర ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. కంభం ప్రాంతానికి చెందిన ఖలీల్ అహ్మద్ అనే వ్యక్తి కరోనాతో సంఘమిత్ర ఆస్పత్రిలో మరణించాడు.
 
ఆసుపత్రి వర్గాలు ఖలీల్ మృతదేహాన్ని తీసుకెళ్లాలంటూ కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు ఆస్పత్రి వద్డకు వచ్చారు. అయితే ఖలీల్ మృతదేహానికి బదులు వీరయ్య అనే వ్యక్తి మృత దేహాన్ని ఇవ్వడంతో ఖలీల్ కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. గట్టిగా ప్రశ్నించగా ఖలీల్ మృత దేహాన్ని అంతకముందే వీరయ్య కుటుంభ సభ్యులకు ఇచ్చినట్లు వెల్లడైంది.
 
మరింత ఆరా తీస్తే వీరయ్య కుటుంబ సభ్యులు ఖలీల్ మృతదేహానికి అంత్యక్రియలు కూడా నిర్వహించేశారని తేలింది. దాంతో ఖలీల్ కుటుంబం ఎంతో వేదనకు గురైంది. తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరించిన ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆ కుటుంబం అధికారులకు విజ్ఞప్తి చేసింది.
 

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments