Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌లో కరోనా కేసులు... మోడీ పర్యటన రద్దు

Webdunia
సోమవారం, 9 మార్చి 2020 (08:51 IST)
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే అనేక దేశాలకు వ్యాపించిన ఈ వైరస్.. తాజాగా బంగ్లాదేశ్‌లో కూడా అడుగుపెట్టింది. బంగ్లాదేశ్‌లో తాజాగా రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ తన బంగ్లా పర్యటనను రద్దు చేసుకున్నారు. 
 
బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహ్మాన్ శతాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు ఈ నెల 17వ తేదీన మోడీ ఢాకాకు వెళ్లాల్సివుంది. కానీ, తాజాగా ఆ దేశంలో మూడు కరోనా కేసులు నమోదు కావడంతో ప్రధాని తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
 
ఇటలీ నుంచి వచ్చిన ఇద్దరు బంగ్లాదేశీయులకు జరిపిన పరీక్షల్లో పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. ఈ నేపథ్యంలో శత జయంతి వేడుకలను వాయిదా వేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. 
 
ఈ మేరకు ఉత్సవ కమిటీ ఛైర్మన్ అబ్దుల్ చౌదరి తెలిపారు. కాగా, ఈ నెల 13న బ్రసెల్స్‌లోని ఈయూ కార్యాలయంలో నిర్వహించనున్న ఇండో-ఈయూ సదస్సుకు కూడా మోడీ హాజరు కావాల్సి ఉన్నా.. ఆ పర్యటనను కూడా రద్దు చేసుకున్న విషయం తెల్సిందే. ఇదే విధంగా పలు దేశాధినేతల పర్యటనలు కూడా కరోనా దెబ్బకు రద్దు అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments