Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెరిగిపోతున్న పాజిటివ్ కేసులు - తెలంగాణాలోను అంతే...

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2020 (10:19 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 62 లక్షలు దాటింది. గత 24 గంటల్లో దేశంలో 80,472 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 62,25,764 కి చేరింది.
 
గ‌త 24 గంట‌ల సమయంలో 1,179 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 97,497 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 51,87,826 మంది కోలుకున్నారు. 9,40,441 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
 
కాగా, దేశంలో మంగళవారం వరకు మొత్తం 7,41,96,729 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,86,688 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
కాగా, తెలంగాణ‌లో కరోనా కేసుల తాజా వివరాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. ఈ గణాంకాల మేరకు రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,103 కేసులు నమోదయ్యాయి. అదేసమయంలో 11 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,243 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,91,386 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,60,933 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,127కు చేరింది. ప్రస్తుతం 29,326 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 298, రంగారెడ్డి జిల్లాలో 172 కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments