Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాక్సినేషన్‌లో భారత్ మరో ఘనత.. దేశంలో 35 కోట్లు దాటిన టీకాల పంపిణీ

Webdunia
ఆదివారం, 4 జులై 2021 (10:58 IST)
వ్యాక్సినేషన్‌లో భారత్ మరో ఘనత సాధించింది.. దేశంలో 35 కోట్లు దాటిన టీకాల పంపిణీ దాటింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఒకప్పుడు నాలుగు లక్షలకు చేరువలో నమోదైన కేసులు కాస్తా.. 50 వేలకు దిగువన నమోదవుతున్నాయి. దీంతోపాటు దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 5 లక్షలకు దిగువన ఉన్నాయి. అయితే.. దేశంలో థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదముందన్న సూచనలతో.. కేంద్రం వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసింది. 
 
కరోనా నియంత్రణకు వ్యాక్సిన్ ప్రధాన ఆయుధం కావడంతో.. అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకుంటోంది. దీంతోపాటు వ్యాక్సిన్ ఉత్పత్తిపై కూడా దృష్టిసారించి వ్యాక్సినేషన్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో భారత్ మరో మైలురాయిని సాధించింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా35 కోట్లకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
 
శనివారం రాత్రి 7 గంటల వరకు అందిన తాత్కాలిక సమాచారం మేరకు.. ఒక్కరోజు దేశవ్యాప్తంగా 57.36లక్షలకుపైగా మోతాదులు అందించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. వ్యాక్సినేషన్ ప్రారంభం నాటినుంచి ఒక్కరోజే దాదాపు ఆరు మిలియన్ల మందికి వ్యాక్సిన్ డోసులు అందించడం ఇదే మొదటిసారని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments