తెలంగాణాలో శాంతించిన కరోనా... దేశంలో పెరిగిన పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 24 జనవరి 2021 (10:39 IST)
తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ చాలా మేరకు శాంతించింది. రోజువారీ కొత్త కేసులు 200 నుంచి 500 లోపే నమోదవుతున్నాయి. శనివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం 29,560 కరోనా టెస్టులు నిర్వహించగా, 197 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,93,253కి చేరింది. ఇందులో 2,88,275 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3389 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కరోనాతో ఒకరు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 1589కి చేరింది.  
 
మరోవైపు, దేశంలో కరోనా కేసులు మళ్ళీ పెరిగాయి. కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా కరోనా బులెటిన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం ఇండియాలో కొత్తగా 14,849 కరోనా కేసులు 155 కరోనా మరణాలు నమోదయ్యాయి. 
 
దేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,06,54,533కి చేరగా, మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,53,339కి చేరింది. 1,03,16,786 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,84,408 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 15,948 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Mokshagna: ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ ఎంట్రీ

విజయ్- రష్మిక వివాహ వేడుక.. మెహందీ నుంచి క్రికెట్ మ్యాచ్ వరకు వివరాలివే..

మేము ప్రతీది కలిసి పని చేస్తాం.. విడాకుల తర్వాత రాజ్ దొరకడం అదృష్టం: సమంత

రష్మిక మందన్న- విజయ్ దేవరకొండ పెళ్లి వేడుకలు ప్రారంభం.. ఇన్‌స్టాలో ఫోటోలు

MAA Dairy: మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ డైరీ ఆవిష్కరించిన భట్టి విక్రమార్క మల్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ వ్యాధులను దరిచేరకుండా చేసే సూప్స్, ఏంటవి?

ఎండుద్రాక్షలు తింటే 7 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

బొప్పాయి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

కాలేయానికి మేలు చేసే పసుపు కలిపిన ఉసిరి రసం, ఇంకా ఏమేమి ప్రయోజనాలు?

మంచి కోడిగుడ్లు, మంచి పాలు వెతుక్కోవాల్సి వస్తోంది, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments