కోళ్లకు కొత్త వైరస్... కీసరలో చనిపోతున్నాయి.. రేట్లు పెరిగాయ్

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (09:51 IST)
వైరస్‌ల బాధ రోజురోజుకీ పెరిగిపోతుంది. మనుషులకే కాకుండా కోళ్ళకు కూడా కొత్త వైరస్ సోకింది. కీసరలో కోళ్లకు కొత్త వైరస్ సోకింది. దీంతో పౌల్ట్రీల్లో కోళ్లు చచ్చిపోతున్నాయి. కోళ్లు చనిపోవడంతో వ్యాపారులు చికెన్ ధరలను పెంచారు. 
 
మే నెలలో కిలో చికెన్ ధర రూ. 130 నుంచి 150 రూపాయలు ఉంది. గత 15 రోజులుగా చికెన్ కేజీ రూ.200లకు పైగా అమ్ముతున్నారు. గత కొన్ని రోజులుగా కోళ్లు అంతుచిక్కని రోగాలతో చనిపోతున్నట్లు ఫౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు.
 
దీంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని వాపోతున్నారు. కనీస ఖర్చులు కూడా రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పెట్రోల్ రేట్ పెరగడంతో కోళ్ల ట్రాన్స్ పోర్టు ఖర్చులు పెరిగాయని, అటు కొత్త వైరస్ టెన్షన్ పెడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. కోళ్లలో ఇన్ఫెక్షన్ వ్యాపిస్తోందని, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే కోళ్లు, పశువుల్లో వైరస్‌లు సహజమని పశువైద్యులు కొట్టి పారేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suri: సూరి, ఆర్ రవికుమార్, మైత్రీ మూవీ మేకర్స్ చిత్రం ప్రకటన

Manasa Sharma: ఫాంటసీ, అడ్వెంచర్‌లతో తీసిన రాకాస కొత్తగా ఉండబోతుంది : మానస శర్మ

Samantha: దీవాన మూవీ లో ప్రేమ సాంగ్ రిలీజ్ చేసిన సమంత

Venky: సూర్య తోపాటు అందరినీ మాయ చేసి వైల్ యానిమల్ తో వెంకీ అట్లూరి షూట్

Rowdy Janardhana: రౌడీ జనార్దన షూట్ లో ఆసక్తికర అంశాన్ని వెల్లడించిన రవి కిరణ్ కోల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆనందం, ఆదరణ, నివారణ సంరక్షణతో వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించాలని జాతీయ పిలుపు

మార్కెట్లోకి నకిలీ కోడిగుడ్లు, గుర్తించడం ఎలా?

డానోన్ ఇండియా రక్తహీనతపై పోరాటానికి సహాయం చేస్తామని ప్రతిజ్ఞ

టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల

తర్వాతి కథనం
Show comments