Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్‌ను కనిపెట్టే కొత్త సాఫ్ట్‌వేర్, 5 సెకన్లే చాలు

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (19:29 IST)
కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచ ప్రజలంతా భయాందోళనలకు గురవుతున్న నేపథ్యంలో ఐఐటి-రూర్కీ ప్రొఫెసర్ కొత్త సాఫ్ట్ వేర్‌ను కనుగొన్నారు. ఇప్పటికే కరోనాకు వ్యాక్సిన్ తయారీకి పరిశోధనలు జరుగుతున్న వేళ.. తాజాగా ఐఐటీ రూర్కీ ప్రొఫెసర్.. కేవలం 5 సెకన్లలో కరోనా వైరస్ వ్యాధిని గుర్తించే సాఫ్ట్‌వేర్‌ను తాను అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. ఈ సాఫ్ట్‌వేర్ పరీక్ష ఖర్చులను తగ్గించడమే కాకుండా ఆరోగ్య సంరక్షణ నిపుణులు గురయ్యే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందన్నారు. 
 
వైరస్ సోకిందన్న అనుమానం ఉన్న వ్యక్తి ఎక్స్-రే ఉపయోగించి ఐదు సెకన్లలోను వైరస్ ఉనికిని గుర్తించవచ్చని వెల్లడించారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి, వైద్యులు ఒక వ్యక్తి ఎక్స్‌రే చిత్రాల ద్వారా సాఫ్ట్‌వేర్ రోగికి న్యుమోనియా లక్షణాలు ఉన్నాయా లేదా అని వర్గీకరించడమే కాదు, అది కరోనాకు సంబంధించిందా లేక ఇతర బ్యాక్టీరియా వల్ల వచ్చిందా అనేది గుర్తించవచ్చన్నారు. తద్వారా ఈ వ్యాధి విస్తరణను అడ్డుకోవచ్చని తెలిపారు. దీని పేటెంట్ కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్)కు దరఖాస్తు చేసినట్టు తెలిపారు. 
 
ఈ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయడానికి 40 రోజులు పట్టిందని సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ కమల్ జైన్ వెల్లడించారు. కరోనా, న్యుమోనియా, క్షయ రోగులతో సహా 60 వేల మంది రోగుల ఎక్స్-రే స్కాన్‌లను విశ్లేషించిన తరువాత మొదట ఒక కృత్రిమ మేధస్సు-ఆధారిత డేటాబేస్ అభివృద్ధి చేసినట్టు వెల్లడించారు. అలాగే అమెరికాకు చెందిన ఎన్ఐహెచ్ క్లినికల్ సెంటర్ ఛాతీఎక్స్-రే డేటాబేస్‌ను కూడా విశ్లేషించానని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments