కరోనా వైరస్ కట్టడికి కొత్త చిట్కా... ఏంటది? (Video)

Webdunia
సోమవారం, 23 మార్చి 2020 (10:12 IST)
చైనాలోని వుహాన్ నగరంలో పురుడుపోసుకున్న కరోనా వైరస్ ఇపుడు ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. సుమారుగా 192 దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది. దీంతో ప్రపంచం గజగజ వణికిపోతోంది. పైగా, ఈ వైరస్ బారినపడి అనేక మంది మృత్యువాతపడుతున్నారు. ముఖ్యంగా, వృద్ధులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వైరస్‌ మరింత వ్యాపించకుండా ఉండేందుకు అనేక దేశాలు లాక్‌డౌన్ ప్రకటిస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఓ కొత్త పద్ధతి తెరపైకి వచ్చింది. వైరస్‌ చేరిన వస్తువులను చేత్తో పట్టుకోవడం ద్వారా కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని తెలిసిందే. వీటిలో తలుపులు తెరిచేప్పుడు డోర్‌నాబ్స్ పట్టుకోవడం, షాపింగ్‌లో కార్ట్స్, ఎలక్ట్రిక్ స్విచ్చులు ఉపయోగించడం కూడా ముఖ్యమైనవే. 
 
అందుకే ఇటువంటి పనులు చేసేటప్పుడు ఎడమచెయ్యి వాడటం ద్వారా వైరస్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చనేదే ఈ కొత్త విధానం. ఎందుకంటే మనలో దాదాపు 90శాతం మంది కుడిచెయ్యి వాటం కలిగినవాళ్లమే. కాబట్టి మొహాన్ని తాకాలంటే ఎక్కువగా కుడిచేతినే ఉపయోగిస్తాం. 
 
అందుకే ఎడమచేతితో ఇలాంటి పనులు చేయడం ద్వారా కుడి చేతికి వైరస్ సోకదు. ఈ విధానానికి కొరియాలో బాగా ప్రచారం చేయడంతో చాలా మంది దీని వల్ల వైరస్ బారిన పడకుండా తప్పించుకున్నారని తెలుస్తోంది. మరి మనం కూడా దీన్ని ఫాలో అయిపోతే బెటర్. వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో మనంకూడా భాగస్వాములవుదాం. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐటీ ఉద్యోగాలు వదిలి హీరోయిన్లు అయ్యారు

Peddi: ఆరు రోజుల్లో పెద్ది షూటింగ్ పూర్తి - ఐటెంసాంగ్ లో సంయుక్త మీనన్ !

Nagababu: CASTE మూవీ నుంచి రంగరాజన్ గా నాగబాబు లుక్

బెల్లంకొండ గణేష్, ఎ. కరుణాకరన్ కాంబినేషన్ లో రొమాంటిక్ కామెడీ చిత్రం

Vishwak Sen: థాయ్‌లాండ్‌లో విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ ల ఈఎన్ఈ రిపీట్ షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో హైడ్రేటెడ్‌గా వుంచే పండ్లు ఇవే

ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినదగిన ఆహార పదార్థాలు ఏమిటి?

గోల్డెన్ మిల్క్ హెల్త్ సీక్రెట్స్

గుండె సంబంధ వ్యాధులు రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

తాజా పిండి: ఆధునిక వంటగదులకు సాంప్రదాయ పిండి రుబ్బే పద్ధతిని తెస్తున్న సాఫ్టెల్

తర్వాతి కథనం
Show comments