Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కాలం.. కొత్త జంటలకు పరీక్షలు.. చేతిపై క్వారంటైన్ ముద్రలు

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (18:16 IST)
కరోనా మహమ్మారితో పరిస్థితులన్నీ తలకిందులైపోయాయి. ముఖ్యంగా, వివాహాల రూపురేఖలే మారిపోయాయి. అంగరంగ వైభవంగా జరుపుకునే పెళ్లి వేడుక ఇపుడు కేవలం వధువు, వరుడితో పాటు... ఇరు కుటుంబ సభ్యులు, ఓ పూజారి, ఓ ఫోటోగ్రాఫర్‌, అతి కొద్ది అతిథులతో ముగించేస్తున్నారు. అదీకూడా ముందుగా అనుమతి తీసుకుని ఈ పెళ్ళి వేడుక నిర్వహించుకోవాల్సివుంటుంది. 
 
ఈ క్రమంలో పలువురు వధువులు, వరుళ్లు ఇతర రాష్ట్రాల్లో పెళ్లి చేసుకుని ఆ తర్వాత తమతమ రాష్ట్రాలకు వస్తున్నారు. ఇలాంటి వారికి ఇరు రాష్ట్రాల ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టు వద్ద విధిగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. వారికి కరోనా వైరస్ సోకినట్టు తేలితే ఆస్పత్రికి లేదంటే హోం క్వారంటైన్‌కు పంపుతున్నారు. హోం క్వారంటైన్‌కు పంపేవారికి మాత్ర చేతిపై హోం క్వారంటైన్ అనే ముద్ర వేస్తున్నారు. అలాంటి ఇంటి నుంచి బయటకు రావడానికి వీల్లేదు. 
 
మఖ్యంగా, తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఈ విషయంలో చాలా ఖచ్చితంగా ఉన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం పుల్లూరు చెక్​పోస్టు వద్ద రెండు నూతన జంటలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఉండవల్లి మండలం మారుమునగాలకు చెందిన జంటకు ఆంధ్రప్రదేశ్​ కర్నూలు జిల్లాలో వివాహం జరిగింది. మ
 
రొకరు మల్దకల్​ మండలం పెద్దొడి గ్రామానికి చెందిన జంట కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ తాలుకా గోవిందపల్లి గ్రామంలో పెళ్లి చేసుకుని వచ్చారు. చెక్​పోస్టు వద్ద ఉన్న అధికారులు... నూతన వధూవరులు, కుటుంబసభ్యుల వివరాలు నమోదు చేసుకుని వైద్య పరీక్షలు చేసి క్వారంటైన్​ ముద్ర వేసి పంపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments